Kantara : ‘కాంతారా’ తెలుగులో కూడా ఊహించని సెన్సేషన్.. ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్.. ఆశ్చర్యంలో టాలీవుడ్..

రిషబ్ శెట్టి హీరోగా ఆయన సొంత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాంతార'. కన్నడలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై............

Kantara :  రిషబ్ శెట్టి హీరోగా ఆయన సొంత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. కన్నడలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి కలెక్షన్లని సాధించింది. అక్టోబర్ 14 శుక్రవారం నాడు హిందీలో, 15 శనివారం నాడు తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

తెలుగులో ఈ సినిమాని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి అల్లు అరవింద్ కూడా ఆశ్చర్యపోయారు. కాంతారా సినిమా హిందీలో రెండు రోజుల్లోనే 4 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక తెలుగులో కూడా కాంతారా సినిమా మొదటి రోజు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపు 2 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి తెలుగులో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక వీకెండ్ ఆదివారం కూడా ఈ సినిమాకి బాగానే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ఏకంగా రెండు రోజుల్లో కేవలం తెలుగులోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

BiggBoss 6 Day 42 : హౌజ్ నుంచి సుదీప ఎలిమినేట్.. డ్యాన్సులు, డైలాగ్స్ తో వీకెండ్ ఎపిసోడ్ రచ్చ..

ఈ సినిమా తెలుగు రైట్స్ 2 కోట్లకు కొన్నారు. మొదటి రోజే పెట్టిన పెట్టుబడి వచ్చేయడంతో ఈ సినిమాకి ఫుల్ లాభాలు గ్యారెంటీ అంటున్నారు. అల్లు అరవింద్ ఈ సక్సెస్ పై మాట్లాడుతూ.. సినిమా బాగుందని తెలుసు, మంచి విజయం సాధిస్తుందని తెలుసు కానీ మరీ ఒక్క రోజులోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని నేను ఊహించలేదు. రెండు రోజుల్లో 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు. వీకెండ్ కూడా ఉండటంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి అని అన్నారు. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్, ఆదరణ చూసి టాలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇక ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

 

ట్రెండింగ్ వార్తలు