Megastar Chiranjeevi : ఇంటికి పిలిచి మరీ అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్.. ఆర్థికంగా కూడా సహాయం..

మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. ఈయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. కొంతకాలం మాత్రమే బతుకుతాడు అని డాక్టర్లు చెప్పారు. దీంతో చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని తన చివరి కోరికని...........

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లోకూడా నిజమైన హీరో. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, తన అభిమానులకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు మెగాస్టార్. తాజాగా ఓ అభిమని చివరి కోరికని తీర్చి మరోసారి తన గొప్ప మనుసుని చాటుకున్నారు.

మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. ఈయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. కొంతకాలం మాత్రమే బతుకుతాడు అని డాక్టర్లు చెప్పారు. దీంతో చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని తన చివరి కోరికని తోటి అభిమానులకు తెలియచేశాడు. దీంతో మెగా అభిమానులు ఈ విషయం మెగాస్టార్ దగ్గరికి తీసుకెళ్లగా చిరంజీవి వెంటనే స్పందించారు.

Mahesh Babu : మహేష్ బర్త్ డే స్పెషల్.. మహేష్ చేసే సేవా కార్యక్రమాలు..

 

తన అభిమాని నాగరాజు కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు మెగాస్టార్. అతన్ని కలిసి ఆప్యాయంగా మాట్లాడి, హత్తుకొని అతని చివరి కోరిక తీర్చాడు. అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందించాడు. అంతేకాక డాక్టర్లతో మాట్లాడి అతనికి ఆర్థిక సహాయం కూడా అందించారు చిరంజీవి. దీంతో ఆ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులతో పాటు, నెటిజన్లు కూడా మరోసారి చిరంజీవిని మా బాస్ బంగారం అంటూ అభినందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు