Harshal Patel : ధోని వికెట్ తీసిన త‌రువాత హ‌ర్ష‌ల్ ప‌టేల్ సెల‌బ్రేష‌న్స్ ఎందుకు చేసుకోలేదు..? అస‌లు కార‌ణ‌మిదే? తెలిస్తే సెల్యూట్‌..

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అల‌రిస్తున్నాడు.

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అల‌రిస్తున్నాడు. అత‌డిని ఔట్ చేయ‌డం ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు స‌వాల్‌గా మారింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌తో క‌లిపి సీఎస్‌కే ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచులు ఆడింది. 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని 224.49 స్ట్రైక్‌రేటుతో 110 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఏడు సంద‌ర్భాల్లో అత‌డు నాటౌట్‌గానే ఉన్నాడు.

కాగా.. పంజాబ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 19వ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి ధోని డ‌కౌట్ అయ్యాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అయితే.. ధోని వికెట్ తీసిన త‌రువాత హ‌ర్ష‌ల్ ప‌టేల్ పెద్దగా సంబురాలు చేసుకోలేదు. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను అత‌డు వివ‌రించాడు. ధోని అంటే త‌న‌కు చాలా గౌర‌వం అని అందుక‌నే పెద్ద‌గా సెల‌బ్రేష‌న్స్ చేసుకోలేద‌న్నాడు.

Ravindra Jadeja : జ‌డేజా మామూలోడు కాదుగా..! ధోనినే వెన‌క్కి నెట్టాడు..

‘నాకు ధోని అంటే ఎంతో గౌర‌వం ఉంది. అందుక‌నే అత‌డిని ఔట్ చేసిన‌ప్పుడు పెద్దగా సంబురాలు చేసుకోలేదు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పిచ్ పొడిబారి ఉంది. మ‌ధ్యాహ్నాం మ్యాచ్ ఆడ‌డం వ‌ల్ల బంతి రివ‌ర్స్ స్వింగ్‌కు స‌హ‌క‌రించింది. తొలి ఓవ‌ర్‌లోనే దీన్ని గ‌మ‌నించాను.’ అంటూ హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో హర్షల్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (26 బంతుల్లో 43), రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 30) లు రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ క‌ర్రాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Sanju Samson : రాహుల్ ద్ర‌విడ్‌తో శ్రీశాంత్ చెప్పిన అబ‌ద్దం.. సంజూ శాంస‌న్ కెరీర్‌ను మార్చేసిందా?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ప్రభసిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 30), శ‌శాంక్ సింగ్ (20 బంతుల్లో 27) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తుషార్ దేశ్ పాండే, సిమర్‌జీత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్న‌ర్‌, శార్దూల్ ఠాకూర్ లు ఒక్కొ వికెట్ సాధించారు.

ట్రెండింగ్ వార్తలు