New AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా

రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ముగ్గురు అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వ సీఎస్ ప్రతిపాదించారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా నియమితుడయ్యారు. వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.

ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పింది. ఎన్నికల వేళ విపక్షాల ఫిర్యాదుల వల్ల రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ఈసీ బదిలీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ముగ్గురు అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వ సీఎస్ ప్రతిపాదించారు.

కాగా, రాజేంద్ర నాథ్ రెడ్డి ఎన్నికల విధులు కూడా అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పింది. ఏపీ సీఎస్ ఇవాళ ఉదయం డీజీపీ ర్యాంక్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాపరెడ్డి, రవికుమార్ గుప్తా పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. 1990 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తావు ఈసీ ఎంపిక చేసింది.

అందుకే నా కారుపై దాడి చేశారు: వైసీపీ అభ్యర్థి కారుమూరి

ట్రెండింగ్ వార్తలు