Nayanthara Vignesh Shivan : కవలలకు తల్లి అయిన నయనతార.. ముందే చెప్పిన ఎన్టీఆర్..! మ్యాటర్ ఏంటంటే..

నయనతార కవల పిల్లలకు తల్లి అవుతుందని ఎన్టీఆర్ ముందే చెప్పేశారని నెటిజన్లు చెబుతున్నారు. అదేంటి? ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు? అసలు ఎన్టీఆర్ కు ఈ విషయం ఎలా తెలుసు? అనే సందేహాలు వచ్చాయి కదూ.

Nayanthara Vignesh Shivan : ప్రముఖ హీరోయిన్ నయనతార-విఘ్నేశ్ దంపతులు కవల మగబిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా నయనతారకు కవలలు కలిగారు. ఈ విషయాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. తమ పిల్లల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని నయన్ దంపతులు చెప్పారు.

నయనతార, తాను అమ్మానాన్నలమయ్యాయని విఘ్నేశ్ శివన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో ఉజ్వలంగా, మనోహరంగా ఉన్నట్టు అనిపిస్తోందని తెలిపారు. దేవుడు డబుల్ గ్రేట్ అని కొనియాడారు. తమ ప్రార్థనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగిందని వెల్లడించారు.

నయనతార కవలలకు తల్లి అయిన ఈ సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకు వచ్చింది. నయనతార కవల పిల్లలకు తల్లి అవుతుందని ఎన్టీఆర్ ముందే చెప్పేశారని నెటిజన్లు చెబుతున్నారు. అదేంటి? ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు? అసలు ఎన్టీఆర్ కు ఈ విషయం ఎలా తెలుసు? అనే సందేహాలు వచ్చాయి కదూ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మ్యాటర్ ఏంటంటే.. నయనతార, ఎన్టీఆర్ అదుర్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో.. ‘మీకు కవలలు పుడతారండీ. మచ్చశాస్త్రం చెబుతోంది’ అని నయన్ తో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఉంటుంది. నెటిజన్లు ఇప్పుడీ డైలాగ్ ను పట్టుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నయన్.. కవలలకు తల్లి అవుతుందని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.

అయితే, నయన్-విఘ్నేశ్ ఆరేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. నాలుగు నెలల క్రితం జూన్ 9, 2022న పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో కుటుంబ సమేతంగా వీరి వివాహం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు