Nara Lokesh : క‌ల్కి హిట్‌ అయినందుకు సంతోషంగా ఉంది.. నారా లోకేష్ స్పెష‌ల్ ట్వీట్‌..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో న‌టించిన సినిమా కల్కి 2898AD.

Minister Nara Lokesh : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో న‌టించిన సినిమా కల్కి 2898AD. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా నేడు (గురువారం జూన్ 27) ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. హాలీవుడ్ లెవల్‌లో సినిమా ఉంద‌ని, సెకండాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే గూస్‌బంప్స్ వ‌చ్చేస్తాయ‌ని చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇక రివ్య్వూలు అన్ని కూడా చాలా పాజిటివ్‌గానే వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌భాస్ ఖాతాలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ప‌డిన‌ట్లేన‌ని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Akira Nandan : ప్ర‌భాస్ క‌ల్కి కోసం.. క‌ల్కి టీ ష‌ర్టు వేసుకుని ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా సంద‌డి..

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డం పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సినిమాకు మంచి రివ్య్వూలు రావ‌డం త‌న‌కు చాలా సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు. సినిమా హిట్టైనందుకు ప్ర‌భాస్‌, అమితాబ్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకోన్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని మ‌రో స్థాయికి తీసుకువెళ్లినందుకు చిత్ర నిర్మాతలు అశ్వినీద‌త్ తో పాటు ఆయ‌న కూతుళ్లు స్వ‌ప్న, ప్రియాంక‌లు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాగా.. లోకేష్ ఈ సినిమా పైనే కాదు గ‌తంలో విడుద‌లైన ప‌లు సినిమాలు విజ‌యాలు సాధించిన సంద‌ర్భాల్లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ట్రెండింగ్ వార్తలు