Akira Nandan : ప్ర‌భాస్ క‌ల్కి కోసం.. క‌ల్కి టీ ష‌ర్టు వేసుకుని ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా సంద‌డి..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా క‌ల్కి 2898 AD.

Akira Nandan : ప్ర‌భాస్ క‌ల్కి కోసం.. క‌ల్కి టీ ష‌ర్టు వేసుకుని ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా సంద‌డి..

Deputy CM Pawan Kalyan Son Akira Nandan Watching On Kalki 2898 AD Movie

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా క‌ల్కి 2898 AD. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విదేశాల‌తో పాటు మ‌న‌దేశంలో ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ప్ర‌ద‌ర్శితం అయ్యాయి. ఈ మూవీకి దాదాపుగా అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింద‌ని సినిమా చూసిన నెటిజ‌న్లు అంటున్నారు. క‌ల్కి విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద ప్ర‌భాస్ అభిమానుల సందడి మామూలుగా లేదు.

ఇక ఈ సినిమాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అకిరానంద‌న్ చూశాడు. హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ ఐమాక్స్‌లో అత‌డు ఈ చిత్రాన్ని వీక్షించాడు. అకిరా క‌ల్కి టీ ష‌ర్డు ధ‌రించి మ‌రీ సినిమా చూసేందుకు రావ‌డం విశేషం. అకిరా సినిమా చూడ‌డానికి వెలుతున్న ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌భాస్ చిత్రాన్ని చూసేందుకు అకిరా రావ‌డంతో ఇటు ప్ర‌భాస్ అభిమానులు, అటు మెగా అభిమానులు సైతం పండ‌గ చేసుకుంటున్నారు.

Kalki Part 2 : అసలు కల్కి కథ పార్ట్ 2లో.. కలియుగాంతం మహాభారత పాత్రలు తిరిగొస్తాయా?

సినిమా విష‌యానికి వ‌స్తే.. దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ల‌తో పాటు ప‌లువురు స్టార్ నటీనటులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.