Karkataka Rasi Phalalu 2026 : కర్కాటక రాశి వారికి కష్ట కాలం.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నమ్మిన వారే నట్టేట ముంచుతారు..!
Karkataka Rasi Phalalu 2026 : శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే..
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 karkataka rasi phalalu Cancer horoscope
Karkataka Rasi Phalalu 2026 : ఈ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో అత్యంత చెడు ఫలితాలు ఎదుర్కోబోతున్న రాశుల వారు ఎవరంటే కర్కాటక రాశి వారు. ఖర్చులు, అవమానాలు అధికం. ఎవరినైనా నమ్మారో.. ఇక మీ పని అంతే. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వివాదాలు రాజుకుని.. కోర్టుకు చేరే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ కనుక.. జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలి. మరి ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన పలు రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే..
ఉగాది నుంచి కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎంతో సహనంతో వ్యవహరిస్తేనే విజయాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం: 2 కాగా వ్యయం మాత్రం 11. అలానే రాజపూజ్యం: 4, అవమానం: 7 ఉంది. దీంతో సమాజంలో చెడ్డ పేరు వచ్చేందుకు అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని.. డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నమ్మిన వారే మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంది కనుక ఎవరినీ అతిగా నమ్మవద్దని.. హెచ్చరిస్తున్నారు.
ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మీరు అనుకున్న ధర రాకపోవడం, వివాదాలు తలెత్తడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బంధుమిత్రులు, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని.. ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలని.. లేదంటే సమస్యలు వస్తాయని అంటున్నారు. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయంటున్నారు.
రంగాల వారీగా ఫలితాలు
- విద్యార్థులు: కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు ఈ సంవత్సరం మంచి ర్యాంకులు సాధించాలంటే చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది. బద్ధకిస్తే.. అనుకున్న కోర్సులో సీటు సాధించలేరని తెలుపుతున్నారు.
- ఉద్యోగస్థులు: కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పెద్దగా ఆశాజనకంగా లేదు. పని ఒత్తిడి పెరుగుతుంది.. దీనికి తోడు కొందరికి ఇష్టం లేని చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
- వ్యాపారస్తులు: ఈ సంవత్సరం కర్కాటక రాశి వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఒంటరిగా వ్యాపారం చేస్తే ఆలస్యంగా అయినా లాభాలు వస్తాయి అంటున్నారు.
- కళాకారులు: భారీ స్థాయిలో కాకుండా చిన్న స్థాయిలో గుర్తింపు, లాభాలు వస్తాయి.
- రాజకీయ నాయకులు: కర్కాటక రాశి నాయకులు ఈ సంవత్సరం పదవుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజల మనసు గెలుచుకుని ముందుకు సాగాలి అంటున్నారు.
- స్త్రీలు: కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉంది.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- పునర్వసు (4వ పాదం) మే,సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి (2027) సోమ, గురు, శని 2, 3, 7
- పుష్యమి (1-4 పాదాలు) మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి (2027) ఆది, బుధ, శని 1, 3, 4, 9
- ఆశ్లేష (1-4 పాదాలు) జూన్, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి (2027) ఆది, బుధ, శుక్ర 2, 3, 4, 5
పరిహారాలు, పూజించాల్సిన దేవతలు:
- గురువు, రాహువు, కేతువులకు జపాలు చేయించుకోవాలి. శెనగలు, మినుములు, ఉలవలు దానం ఇవ్వాలి.
- దైవ దర్శనం: శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం చాలా శ్రేయస్కరం.
- స్తోత్ర పఠనం: విష్ణు సహస్రనామ స్తోత్రము, బిల్వాష్టకము, లింగాష్టకము చదవాలి. గజేంద్ర మోక్షం ప్రతిరోజు వినడం వల్ల మేలు జరుగుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
