Pawan Kalyan: పవన్ చెప్పినా నమ్మరా.. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు
పవన్ కళ్యాణ్(Pawan kalyan) అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన టీం.
Pawan Kalyan team gave clarity on his upcoming films.
- మళ్ళీ తెరపైకి ‘ఓజీ’ ప్రీక్వెల్
- ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులతో పవన్ కల్యాణ్
- పవన్ టీమ్ ఇచ్చిన క్లారిటీ ఇదే
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నందున కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని ఆయన బృందం ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ, పుకార్లు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్ రాబోతుందని, దానికి ‘ఓజాస్ గంభీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Nabha Natesh: స్టైలిష్ అండ్ హాట్.. కిల్లింగ్ లుక్స్‌తో మెరిసిపోతున్న నాభా నటేష్.. ఫొటోలు
ఇదే విషయం గురించి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) సన్నిహిత వర్గాలను సంప్రదించగా, వారు కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ ముందు కేవలం ఓజీ ప్రీక్వెల్ మాత్రమే కాకుండా, పలువురు అగ్ర దర్శకుల ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమాతో పాటు, ఏఎం రత్నం కూడా పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టులను నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్.
అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టులపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని ఆయన టీమ్ స్పష్టం చేసింది. ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ గురించి సరైన సమయం వచ్చినప్పుడు పవన్ స్వయంగా ప్రకటిస్తారని వారు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన దృష్టి మొత్తం ప్రజా సేవపైనే ఉన్నందున, సినిమాల విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలు రావని క్లారిటీ ఇచ్చారు. దీంతో, పవన్ టీం చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
