Bank of Baroda Recruitment 2026 : భారీగా బ్యాంకు ఉద్యోగాలు.. 45 ఏళ్ల వయసు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఏప్రిల్ 16 వరకే ఛాన్స్..!
Bank of Baroda Recruitment 2026 : బ్యాంకు ఉద్యోగం కోసం చూసేవారికి భారీ శుభవార్త. ఈ పోస్టులకు 45 ఏళ్ల వయసున్నా దరఖాస్తు చేసుకోవచ్చు
bank of baroda recruitment 2026 for 104 group head territory head and deputy manager posts full details here
Bank of Baroda Recruitment 2026 : బ్యాంకు ఉద్యోగమనే కాదు.. ఏ కొలువుకైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దిష్టమైన వయో పరిమితి (Age Limit) ఉంటుంది. కొన్ని సామాజిక వర్గాల వారికి ఏజ్ లిమిట్లో మినహాయింపు ఇస్తుంటారు. మిగతా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉన్నా, బ్యాంకు ఉద్యోగాలకు మాత్రం కచ్చితమైన వయో పరిమితి ఉంటుంది. ఆ వయసు దాటిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. కానీ తాజాగా ఓ బ్యాంకు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. 45 ఏళ్ల వయసు వరకు ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలు..
ఈ అవకాశం కల్పిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB). ఈ బ్యాంకు గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, డిప్యూటీ మేనేజర్ వంటి వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటిలో కొన్ని ఉద్యోగాలకు 45 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న మొదలైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 16, 2026 వరకు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేయాలని భావించే అభ్యర్థులు.. భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీల నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఆయా పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు మాస్టర్ డిగ్రీ లేదా మేనేజ్మెంట్లో డిప్లొమా కూడా ఉండాలి.
వయో పరిమితి:
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు పోస్టును బట్టి వరుసగా 24, 27, 31 సంవత్సరాలు కాగా.. గరిష్ట వయస్సు వరుసగా 35, 40, 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: 5 ఏళ్ల వయో సడలింపు.
- ఓబీసీ అభ్యర్థులకు: 3 ఏళ్ల వయో సడలింపు.
ఫీజు వివరాలు:
- ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- జనరల్, EWS, OBC అభ్యర్థులకు: రూ. 850.
- SC, ST, దివ్యాంగులకు: రూ. 175 గా నిర్ణయించారు.
పూర్తి వివరాలకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
