Raghu Rama Krishna Raju : భీమవరంలో కల్కి సెలబ్రేషన్స్.. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు హడావిడి మాములుగా లేదుగా..

భీమవరం అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అడ్డా అని తెలిసిందే.

Raghu Rama Krishna Raju : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు జూన్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడమే కాకుండా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు, సెలబ్రేషన్స్ తో రచ్చ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కల్కి సినిమాని రిలీజ్ రోజే థియేటర్స్ లో చూస్తున్నారు. సోషల్ మీడియాలో కల్కి టీమ్ కి అభినందనలు తెలియచేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు థియేటర్స్ వద్ద సందడి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Mahabharatam : మహాభారతం రాజమౌళి తీస్తాడా? నాగ్ అశ్విన్ తీస్తాడా?

ఇక భీమవరం అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అడ్డా అని తెలిసిందే. భీమవరంలో ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రభాస్ సొంతూరు అక్కడే కావడంతో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ రెబల్ స్టార్ ఫ్యాన్సే. ప్రభాస్ ఏ సినిమా రిలీజయినా బ్యానర్లు, ఫ్లెక్సీలు, థియేటర్స్ వద్ద సెలబ్రేషన్స్ తో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి చేస్తారు. ఇప్పుడు కల్కి సినిమాకు కూడా అదే రేంజ్ లో సందడి చేస్తున్నారు.

అయితే భీమవరం కల్కి సెలబ్రేషన్స్ లో ఇవాళ తెల్లవారుజామునే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. థియేటర్ బయట ఏర్పాటు చేసిన వేదిక వద్ద కల్కి లెటర్స్ ఉన్న కేక్ ని కోశారు. అభిమానులతో కలిసి సినిమా చూసి సందడి చేసారు. అనంతరం ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. కల్కి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ హడావిడి ఇక్కడితో ఆగదు. కల్కి 2 కూడా ఉంది. మన ఊరు హీరో ప్రభాస్ తో అశ్వినీదత్ గారు భారీ సినిమా తీశారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తారు ఈ సినిమాతో. కల్కి 2 కోసం ఎదురుచూద్దాం అని అన్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు వీడియోలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు