Mahabharatam : మహాభారతం రాజమౌళి తీస్తాడా? నాగ్ అశ్విన్ తీస్తాడా?

కల్కి సినిమాలో కలియుగాంతానికి, కురుక్షేత్ర యుద్దానికి లింక్ పెట్టి చూపించారు.

Mahabharatam : బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమని పాన్ ఇండియా చేసి, RRRతో ఆస్కార్ వద్దకు తీసుకెళ్లి రాజమౌళి అందనంత ఎత్తుకు ఎదిగాడు. అసలు ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని తన సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేసాడు. అయితే రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని, ఎప్పటికైనా మహాభారతం సినిమా తీస్తానని పలుమార్లు చెప్పాడు.

రాజమౌళి తాను మహాభారతం తీస్తే ఒక్క పార్ట్ తో అవ్వదని, అలాగే దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి నటీనటులు తీసుకుంటానని కూడా తెలిపాడు. ఇప్పటికే టీవీ సీరియల్స్, గతంలో సినిమాల రూపంలో మహాభారతాన్ని మనం చూసాము. కానీ రాజమౌళి మహాభారతం తీస్తాను అని చెప్పడంతో ఆయన టేకింగ్ కోసం, ఆయన తీసే మహాభారతం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి కంటే ముందు డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతం తీసేస్తాడేమో, రాజమౌళిని మించేలా విజువల్స్ చూపిస్తాడేమో అని అంతా అనుకుంటున్నారు.

Also Read : Rajamouli – Prabhas : రాజమౌళి చెప్పినట్టే ప్రభాస్ చేశాడు.. కల్కిలో ప్రభాస్ పాత్ర రాజమోళి ఎప్పుడో చెప్పాడు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో కలియుగాంతానికి, కురుక్షేత్ర యుద్దానికి లింక్ పెట్టి చూపించారు. దీంతో కల్కి సినిమాలో మహాభారతం విజువల్స్ కూడా చూపించారు. సినిమా మొత్తం ఒక 5 నిమిషాల మహాభారతం విజువల్స్ కట్ షాట్స్ గా అక్కడక్కడా వస్తాయి. వాటికి సినిమాలో సరైన ఎలివేషన్ పడింది. ఆ సీన్స్ వరకు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. అసలు ఇంతబాగా కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు ఇంకెవరు చూపించలేరేమో అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ ని అందరూ పొగిడేస్తున్నారు.

Also Read : Prabhas – Amitabh Bachchan : కల్కి హీరో ప్రభాస్.. సినిమా మాత్రం అమితాబ్‌ది..

మహాభారతం కల్కి నెక్స్ట్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. దీంతో కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలో మహాభారతం చూపిస్తారని తెలుస్తుంది. కల్కి సినిమాలో ఒక్క 5 నిముషాలు మహాభారతం విజువల్స్ చూపిస్తేనే ఓ రేంజ్ లో హై ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. అదే ఇక మహాభారతం సీన్స్ ఇంకా ఎక్కువ చూపిస్తే, కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు చూపిస్తే ప్రేక్షకులు ఇంకే రేంజ్ లో ఫీల్ అవుతారో అని అంటున్నారు. దీంతో రాజమౌళి కంటే ముందే నాగ్ అశ్విన్ తన కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మహాభారతం చూపించేస్తాడేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కొంతమంది అయితే రాజమౌళి, నాగ్ అశ్విన్ కలిసి మహాభారతం తీస్తే అదిరిపోతుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు