Rajamouli – Prabhas : రాజమౌళి చెప్పినట్టే ప్రభాస్ చేశాడు.. కల్కిలో ప్రభాస్ పాత్ర రాజమోళి ఎప్పుడో చెప్పాడు..

గతంలో రాజమౌళిని ఓ ఈవెంట్లో మాట్లాడుతూ మహాభారతం తీస్తే ప్రభాస్ కి ఓ పాత్ర ఇస్తాను అని ఓ వీరుడి పేరు చెప్తాడు.

Rajamouli – Prabhas : రాజమౌళి చెప్పినట్టే ప్రభాస్ చేశాడు.. కల్కిలో ప్రభాస్ పాత్ర రాజమోళి ఎప్పుడో చెప్పాడు..

Rajamouli said Prabhas Character in Kalki Before Years Fans Surprised

Rajamouli – Prabhas : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా కథ, సినిమాలో ఎవరెవరు ఏమేమి పాత్రలు చేసారో సోషల్ మీడియాలో లీక్ అయిపొయింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

కల్కి సినిమాలో ప్రభాస్ బౌంటీ హంటర్(డబ్బుల కోసం పని చేసే రౌడీ షీటర్)లాంటి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేశాడు. అయితే ప్రభాస్ ని క్లైమాక్స్ లో మహాభారతంలోని ఓ పాత్రలో చూపించి ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. క్లైమాక్స్ సీన్స్ అదిరిపోతాయి. దీంతో కల్కి పార్ట్ 2లో ప్రభాస్ మహాభారతంలోని ఆ పాత్రలో ఎక్కువ సేపే కనిపిస్తాడని తెలుస్తుంది.

Also Read : Prabhas – Amitabh Bachchan : కల్కి హీరో ప్రభాస్.. సినిమా మాత్రం అమితాబ్‌ది..

అయితే గతంలో రాజమౌళిని ఓ ఈవెంట్లో మాట్లాడుతూ మహాభారతం తీస్తే ప్రభాస్ కి ఓ పాత్ర ఇస్తాను అని ఓ వీరుడి పేరు చెప్తాడు. అప్పుడు కొన్నాళ్ల క్రితం రాజమౌళి చెప్పిన పాత్రే ఇప్పుడు ప్రభాస్ కల్కి క్లైమాక్స్ లో చేయడంతో ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కంటే ముందే నాగ్ అశ్విన్ ప్రభాస్ ని ఆ పాత్రలో చూపించేసాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి గతంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి రాజమౌళి గతంలో చెప్పిన పాత్ర ఏంటి? ప్రభాస్ కల్కి క్లైమాక్స్ లో చేసిన పాత్ర ఏంటో రాజమౌళి మాటల్లోనే వినేయండి..