Prabhas – Amitabh Bachchan : కల్కి హీరో ప్రభాస్.. సినిమా మాత్రం అమితాబ్‌ది..

కల్కి సినిమా మహాభారతంలో అశ్వత్థామతో మొదలై మళ్ళీ అశ్వత్థామతో ముగుస్తుంది.

Prabhas – Amitabh Bachchan : కల్కి హీరో ప్రభాస్.. సినిమా మాత్రం అమితాబ్‌ది..

Kalki 2898 AD Movie Prabhas Vs Amitabh Bachchan

Prabhas – Amitabh Bachchan : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ కూడా పండించాడు. బౌంటీ హంటర్(డబ్బుల కోసం పని చేసే రౌడీ షీటర్)లాంటి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్ లోను అదరగొట్టేసాడు. క్లైమాక్స్ లో అయితే ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అయితే ప్రభాస్ ముందు కామెడీగా కనిపించి తర్వాత యాక్షన్ చేసాడు. కానీ అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కి మొదటి నుంచి కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు.

Also Read : Kalki Part 2 : 10 రోజుల్లో కల్కి పార్ట్ 2 వర్క్ మొదలు.. కల్కి పార్ట్ 2 వచ్చేది అప్పుడే..

అసలు కల్కి సినిమా మహాభారతంలో అశ్వత్థామతో మొదలై మళ్ళీ అశ్వత్థామతో ముగుస్తుంది. అశ్వత్థామ పాత్ర వలన ప్రభాస్ కంటే అమితాబ్ కి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. యాక్షన్స్ లో ప్రభాస్ ని అశ్వత్థామ డామినేట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఆ పాత్ర వలన అమితాబ్ ని ఆ రేంజ్ లో చూపించారు. ప్రభాస్ – అమితాబ్ మధ్య ఇంటర్వెల్ కి ముందు, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయి. కల్కి సినిమా చూసి నార్త్ లో మాత్రం తమ అమితాబ్ బచ్చన్ ని ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు.

Also Read : Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..

ఇక అమితాబ్ కూడా ఈ ఏజ్ లో అలాంటి మేకప్ వేసుకొని, ఆ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం అంటే మాములు విషయం కాదు. కల్కి సినిమాలో ప్రభాస్ మెయిన్ హీరో అయినా కథ మొదలుపెట్టేది, ఈ కథకి మహాభారతానికి లింక్ ఇచ్చేది, కథలో పుట్టబోయే బిడ్డని, ఆ మహిళని కాపాడేది, సినిమా ముగించేది కూడా అమితాబే. దీంతో అమితాబ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏజ్ లో అదిరిపోయే ఎలివేషన్స్, మంచి పాత్ర పడింది అమితాబ్ కి. అందుకే కల్కి హీరో ప్రభాస్ అయినా సినిమా మాత్రం అమితాబ్ దే.