Kalki Part 2 : 10 రోజుల్లో కల్కి పార్ట్ 2 వర్క్ మొదలు.. కల్కి పార్ట్ 2 వచ్చేది అప్పుడే..

కల్కి పార్ట్ 2 గురించి నిన్న ప్రభాస్ - నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు.

Kalki Part 2 : 10 రోజుల్లో కల్కి పార్ట్ 2 వర్క్ మొదలు.. కల్కి పార్ట్ 2 వచ్చేది అప్పుడే..

Kalki Cinematic Universe Prabhas Kalki 2898 AD Movie Part 2 Update

Kalki Part 2 : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉండటంతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చారు. అంతే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించాడు.

దీంతో కల్కిసినిమాటిక్ యూనివర్స్ లో ఈ కథకు లింక్ తో చాలా సినిమాలు ఉండొచ్చని తెలుస్తుంది. అలాగే అసలు కల్కి కథ పార్ట్ 2లోనే ఉండబోతుంది. దీంతో పార్ట్ 1 ఇంత హైప్ ఇచ్చిందంటే కల్కి పార్ట్ 2 ఇంకెంత హైప్ ఇస్తుందో అని భావిస్తున్నారు. అయితే కల్కి పార్ట్ 2 గురించి నిన్న ప్రభాస్ – నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు.

Also Read : Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..

ప్రభాస్ మాట్లాడుతూ.. పది రోజుల్లో మళ్ళీ కల్కి 2 వర్క్ మొదలుపెట్టాలి కదా వెళ్లి రెస్ట్ తీసుకో అని నాగ్ అశ్విన్ తో అన్నాడు. దీంతో కల్కి పార్ట్ 2 సినిమా వర్క్ పది రోజుల్లో మొదలుపెడతారని తెలుస్తుంది. ఆల్రెడీ బేసిక్ కథ రాసుకున్నారని, ఆల్రెడీ సెట్స్ కొన్ని వేసే ఉన్నాయి, కొంత పార్ట్ 2 పోర్షన్ కూడా షూట్ తీసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే కల్కి పార్ట్ 2 మూడు సంవత్సరాల తర్వాతే వస్తుందని సమాచారం. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు, వాటి షూటింగ్ డేట్స్ ప్రకారం అయితే వచ్చే సంవత్సరం చివర్లోనే కల్కి పార్ట్ 2 కి డేట్స్ ఇవ్వగలడు. దీంతో ఈ సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ చివర్లో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. అనుకున్నట్టు జరిగితే 2027లో కల్కి పార్ట్ 2 సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది.