Pushpa 2 : బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని బీట్ చేసిన పుష్ప 2

‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్పరాజ్ గా సెకండ్ పార్ట్ లో బన్నీ ఇంకే రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాడనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అది ఎంతలా అంటే............

Pushpa 2 :  అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ బాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీని ఎఫెక్ట్ తో ‘పుష్ప 2’ కు అక్కడ భారీ బజ్ క్రియేట్ అయింది. అది ఎంతలా అంటే షారుఖ్, సల్మాన్ ఖాన్ ల నెక్స్ట్ మూవీస్ క్రేజ్ ను కూడా దాటేసేలా.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రెడ్ శాండల్ స్మగ్లింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసింవదే. ఇందులో పుష్పరాజ్ అనే స్మగ్లర్ గా బన్నీ పెర్ఫార్మెన్స్ కు బాలీవుడ్ జనం బ్రహ్మరథం పట్టారు. బాలీవుడ్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల వారికి షాకిచ్చింది. రిలీజైన రోజు సాధారణ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘పుష్ప’ ఈ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని ఎవరూ అంచనా చేయలేదు.

రీసెంట్ గా ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్పరాజ్ గా సెకండ్ పార్ట్ లో బన్నీ ఇంకే రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాడనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అది ఎంతలా అంటే ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ లోని సినిమాలన్నిటినీ పక్కకు నెట్టేసి నెం.1 మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచిపోయింది. బాలీవుడ్ లోని బడా స్టార్స్ సినిమాలపై ఉన్న భారీ అంచనాలన్నీ పుష్ప 2 పైకి షిఫ్ట్ అవడం ఆశ్చర్యమని చెప్పాలి.

బాలీవుడ్ బాద్షా షారుఖ్, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ల నెక్స్ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సినిమాల క్రేజ్ నే దాటేసే స్థాయిలో ‘పుష్ప 2’ క్రేజ్ ఉండడం గ్రేట్. షారుఖ్ నెక్స్ట్ మూవీ ‘పఠాన్’. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కాబోతోంది. షారుఖ్ సూపర్ హిట్ అందుకొని చాలా కాలమైపోయింది. అందుకే ఈ సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కాబట్టి మరింతగా హైప్ క్రియేట్ అయింది. అయినప్పటికీ దాని కన్నా ‘పుష్ప 2’కు పెరుగుతోన్న పాజిటివ్ బజ్ ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆ విషయంలో ‘పఠాన్’ సెకండ్ ప్లేస్ లో ఉంది. జవాన్, డుంకీ సినిమాలు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేసెస్ లో ఉన్నాయి.

VishwakSen : విశ్వక్‌సేన్ హిట్ 2 ఎందుకు చేయలేదు.. విశ్వక్‌ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా??

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాల లిస్ట్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టైగర్ 3’. గతంలో సూపర్ హిట్టైన ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ ప్రాంచైజీ లో మూడో సినిమా ఇది. గత రెండు సినిమాల్ని కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తే .. ఈ భాగాన్ని మనీశ్ శర్మ డైరెక్ట్ చేయనుండడం విశేషం. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. గత రెండు భాగాలు సూపర్ హిట్టవడంతో ‘టైగర్ 3’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీని కన్నా ‘పుష్ప 2’ మూవీపైనే బజ్ ఎక్కువగా ఉండడం ఆశ్చర్యమనిపించక మానదు. మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ మూవీస్ లిస్ట్ లో ‘టైగర్ 3’ థర్డ్ ప్లేస్ లో ఉంది. మరి ఆ సినిమాలన్నిటి కన్నా ఎక్కువగా క్రేజ్ క్రియేట్ అయిన ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు