Mega Heroes : ఈ ఫొటోల్లో ఉన్న మెగాహీరోలు ఎవరో గుర్తుపట్టారా..? అలాగే పిక్ ఏ టైంలో తీసిందో తెలుసా..?

మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. మరి ఈ కనిపిస్తున్న పిక్ లో ఉన్న మెగా వారసులు ఎవరో గుర్తు పట్టారా..?

Ram Charan Varun Tej Sai Dharam Tej Vaishnav Tej Childhood Photos

Mega Heroes : మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాతి జనరేషన్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), వరుణ్ తేజ (Varun Tej), సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా ఒక్కొక్కరిగా ఆడియన్స్ ముందుకు వచ్చి కొందరు స్టార్ హీరోలుగా ఎదిగారు, మరికొంతమంది ఎదిగే ప్రయాణంలో ఉన్నారు. ఈ హీరోలను సినిమా రంగప్రవేశం అయిన దగ్గర నుంచి మీరు చూస్తూనే వచ్చారు. కానీ వారి చిన్నప్పటి ఫోటోలను చాలా తక్కువ చూసి ఉంటారు.

NTR – Mokshagna Teja : నందమూరి మల్టీస్టారర్‌తో బాలయ్య వారసుడు ఎంట్రీ.. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్-మోక్షజ్ఞ..

Ram Charan Varun Tej Sai Dharam Tej Vaishnav Tej Childhood Photos

ఈ పైన కనబడుతున్న ఫొటోలో ఉన్న మెగా హీరోలు ఎవరో గుర్తు పట్టారా..? బ్లూ షర్ట్ వేసుకొని ఉన్న బుడ్డోడిని మీరు చాలా తేలిగ్గా గుర్తుపట్టేసి ఉంటారు. తనెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి తను ఎత్తుకున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా. ఇప్పుడు ఆ పిల్లాడో చరణ్ కంటే ఎత్తు అయ్యి, తనని ఎత్తుకునే పొజిషన్ లో ఉన్నాడు. అతనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తన రెండో బర్త్ డే సమయంలో చరణ్ అలా ఎత్తుకొని ఫోటో దిగాడు. అలాగే ఈ కింద కనబడుతున్న ఫొటోలోని మెగా వారసులను కూడా గుర్తుపట్టండి చూద్దాం.

Varun Tej : వరుణ్ తేజ్ ఫోన్‌లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా..?

Ram Charan Varun Tej Sai Dharam Tej Vaishnav Tej Childhood Photos

ఈ గ్రూప్ ఫొటోలో వరుణ్ తేజ్, రామ్ చరణ్, శ్రీజ కొణిదెల, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఉన్నారు. తమ కజిన్స్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. మెగాహీరోలు ఇలాంటి రేర్ పిక్స్ ని షేర్ చేస్తుంటారు. ఇటీవల పవన్ కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన చిప్పటి ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇక ఇలాంటి పిక్స్ చూసినప్పుడు మెగా అభిమానులు చాలా హ్యాపీ అవుతుంటారు. తమ చిన్నప్పటి పిక్స్ దాచుకున్నట్లు తమ హీరోల చిన్నప్పటి ఫోటోలను కూడా సేవ్ లిస్ట్ లో యాడ్ చేసేస్తుంటారు.

 

 

ట్రెండింగ్ వార్తలు