MAA : మొన్న 5 నేడు 18 యూట్యూబ్ ఛానల్స్‌కు మా అసోసియేషన్ షాక్.. మరో హెచ్చరిక జారీ..
సినీ నటులపై అభస్యకరంగా ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) గట్టి షాకిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- July 24, 2024 / 04:27 PM IST
MAA terminates another18 more youtube channels
Movie artist association : సినీ నటులపై అభస్యకరంగా ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) గట్టి షాకిస్తోంది. ఇటీవలే ఐదు యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్చలు తీసుకోగా.. తాజాగా మరో 18 ఛానల్స్‌ని బ్లాక్ చేయించినట్లు తెలిపింది. ఈ 18 యూట్యూబ్ ఛానల్స్ పేర్లు, వాటి యూఆర్ఎల్ లింక్‌లను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, నవీన్ క్రిష్, రేసింగ్ ఉమాపతి, డాక్టర్ ట్రోల్స్, నేను మీ జాను, లై చేయి బ్రో, రవితేజ వోల్స్, ట్రోలింగ్ పోరడు, ఇది యాపారం, మై ఛానెల్ మై రూల్స్, కామెడీ ట్రోలింగ్, కింగ్ చంద్రహాస్, కేసీపీడీ ట్రోల్స్, కామెడీ ట్రోలింగ్ వంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
Raj Tharun Movie : రాజ్ తరుణ్ సినిమా.. మహేష్ శ్రీమంతుడిలా అనిపించొచ్చు కానీ..
ఈ క్రమంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరో హెచ్చరిక జారి చేసింది. పరువు నష్టం కలిగించే, అసభ్యకరంగా ఉన్న ట్రోలింగ్ వీడియోస్ మీద ఓ రిపోర్టును తయారు చేస్తున్నట్లు తెలిపింది. దాన్ని సైబర్ కార్యాలయానికి ఇవ్వబోతున్నట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని అనుకుంటే మీ ఛానెల్స్‌లో కించపరిచే విధంగా ఉన్న వీడియోలను వెంటనే తొలగించాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరింది.
