IND vs SL : టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌కు ముందే శ్రీలంక‌కు భారీ షాక్‌.. ఇక లంక‌కు క‌ష్ట‌కాల‌మే..!

టీమ్ఇండియాతో సిరీస్‌కు ముందే శ్రీలంక‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

Dushmantha Chameera ruled out from Indian series due to injury

India vs Srilanka : పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూపు ద‌శ నుంచే నిష్ర్క‌మించిన శ్రీలంక జ‌ట్టు పై ఆదేశంలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కెప్టెన్సీకి వ‌నిందు హ‌స‌రంగ రాజీనామా చేశాడు. దీంతో కొత్త కెప్టెన్ చ‌రిత్ అస‌లంక నేతృత్వంలో లంక జ‌ట్టు భార‌త్‌తో టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు సిద్ధం అవుతోంది. జూలై 27 నుంచి మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. టీమ్ఇండియాతో సిరీస్‌కు ముందే శ్రీలంక‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ దుష్మంత చమీర గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. అయితే.. లంక బోర్డు మాత్రం అధికారికంగా ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌లేదు. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలో అనే విష‌యం పై ప్ర‌స్తుతం సందిగ్ధం నెల‌కొన్న‌ట్లుగా తెలుస్తోంది. టీమ్ఇండియాతో సిరీస్‌లో సీనియ‌ర్ ఆట‌గాడు అయిన దుష్మంత సేవ‌ల‌ను కోల్పోవ‌డం లంక జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

Gautam Gambhir : ‘అలా కాదు.. ఇలా ఆడాలి..’ సంజూ శాంస‌న్‌కు గంభీర్ స్పెష‌ల్ క్లాస్‌..

ఇదిలా ఉంటే.. ఈ లంక పేస‌ర్ గ‌త రెండేళ్లుగా గాయాల‌తో సావాసం చేస్తున్నాడు. లంక త‌రుపున చివ‌రి సారి ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో స్థానం ద‌క్కిన‌ప్ప‌టికి తుది జ‌ట్టులో మాత్రం చోటు ల‌భించ‌లేదు. 32 ఏళ్ల చ‌మీర ఇప్ప‌టి వ‌ర‌కు లంక త‌రుపున 55 టీ20 మ్యాచులు ఆడి 55 వికెట్లు తీశాడు.

భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య జూలై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. వ‌న్డే సిరీస్ ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానుంది.

టీ20 సిరీస్‌కు లంక జ‌ట్టు ఇదే..
చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్‌ నిస్సంక, కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్‌ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశ పతిరణ, నువాన్‌ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.

Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు ఎస‌రు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌..! శ్రీలంక సిరీస్‌లోనే..!

భారత జట్టు ..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

ట్రెండింగ్ వార్తలు