Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు ఎస‌రు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌..! శ్రీలంక సిరీస్‌లోనే..!

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఎంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు ఎస‌రు పెట్టిన రోహిత్ శ‌ర్మ‌..! శ్రీలంక సిరీస్‌లోనే..!

Rohit Sharma On Cusp Of Overtaking Rahul Dravid in ODIS runs

Rohit Sharma – Rahul Dravid : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఎంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన ఏకైక ఆట‌గాడు హిట్‌మ్యానే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన జోష్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆగ‌స్టులో శ్రీలంక వేదిక‌గా జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో ఆడ‌లేదు.

లంక సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌ను ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి. వ‌న్డేల్లో టీమ్ఇండియా త‌రుపున రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 262 మ్యాచుల‌ను ఆడాడు. 49.12 స‌గ‌టుతో 10,709 ప‌రుగులు చేశాడు. భార‌త్ త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. లంక‌తో వ‌న్డే సిరీస్‌లో రోహిత్ మ‌రో 59 ప‌రుగులు చేస్తే రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించి నాలుగో స్థానానికి చేరుకుంటాడు. ద్ర‌విడ్ 340 మ్యాచుల్లో 39.15 స‌గ‌టుతో 10,768 ప‌రుగులు చేశాడు.

IND vs PAK : త‌ట‌స్థ వేదిక‌ల్లో భార‌త్, పాక్ టీ20 సిరీస్‌.. పీసీబీ కీల‌క వ్యాఖ్య‌లు..

512 ప‌రుగులు చేస్తే..

లంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో రోహిత్ గ‌నుక 512 ప‌రుగులు చేస్తే మాజీ కెప్టెన్ గంగూలీని అధిగ‌మిస్తాడు. అప్పుడు వ‌న్డేల్లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంటాడు. సౌర‌వ్ గంగూలీ 308 మ్యాచుల్లో 40.95 స‌గ‌టుతో 11,221 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో 463 మ్యాచుల్లో 44.83 స‌గ‌టుతో 18,426 ప‌రుగుల‌తో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. 292 మ్యాచుల్లో 58.67 సగ‌టుతో 13,848 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నారు.

టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..
* స‌చిన్ టెండూల్క‌ర్ – 463 మ్యాచుల్లో 18,426 ప‌రుగులు
* విరాట్ కోహ్లీ – 292 మ్యాచుల్లో 13,848 ప‌రుగులు
* సౌర‌వ్ గంగూలీ – 308 మ్యాచుల్లో 11,221 ప‌రుగులు
* రాహుల్ ద్ర‌విడ్ – 340 మ్యాచుల్లో 10,768 ప‌రుగులు
* రోహిత్ శ‌ర్మ – 262 మ్యాచుల్లో 10, 709 ప‌రుగులు
* మ‌హేంద్ర సింగ్ ధోని – 347 మ్యాచుల్లో 10,599 ప‌రుగులు

Kieron Pollard : ఎంత ప‌ని చేశావ్ పొలార్డ్‌.. అమ్మాయిని గాయ‌ప‌రుస్తావా.. పాపం నొప్పితో విల‌విల‌లాడిందిగా..!