Kieron Pollard : ఎంత పని చేశావ్ పొలార్డ్.. అమ్మాయిని గాయపరుస్తావా.. పాపం నొప్పితో విలవిలలాడిందిగా..!
ఓ అమ్మాయిని వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పోలార్డ్ గాయపరిచాడు.
![Kieron Pollard : ఎంత పని చేశావ్ పొలార్డ్.. అమ్మాయిని గాయపరుస్తావా.. పాపం నొప్పితో విలవిలలాడిందిగా..! Kieron Pollard : ఎంత పని చేశావ్ పొలార్డ్.. అమ్మాయిని గాయపరుస్తావా.. పాపం నొప్పితో విలవిలలాడిందిగా..!](https://10tv.in/wp-content/uploads/2024/07/Kieron-Pollard-apologizes.jpg)
Pic credit : screen grab from MI New York
Kieron Pollard apologizes : ఓ అమ్మాయిని వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పోలార్డ్ గాయపరిచాడు. అనంతరం ఆమెకు క్షమాపణలు చెప్పాడు. అయితే.. పొలార్డ్ ఆ అమ్మాయిని కావాలని గాయపరచలేదు. అతడు కొట్టిన సిక్స్.. స్టాండ్స్‌లో ఉన్న ఆ అమ్మాయి భుజాన్ని తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటు చేసుకుంది.
మేజర్ లీగ్ క్రికెట్లో బాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవర్లో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్ (35; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (27; 23 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. ముంబై బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు, కెంజిగే చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యాన్ని ముంబై 17 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బ్యాటర్లలో నికోలస్ పూరన్ (35; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (33నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బ్రెవిస్ (27; 19 బంతుల్లో 5ఫోర్లు) లు దంచికొట్టారు. నైట్ రైడర్స్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు.
దంచికొట్టిన పొలార్డ్..
ఈ మ్యాచ్‌లో పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 33 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించుకున్నాడు. కాగా.. ముంబై ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఓ ఘటన చోటు చేసుకుంది. స్పెన్సర్ జాన్సన్ వేసిన ఈ ఓవర్లో పొలార్డ్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. అయితే.. ఇందులో ఓ సిక్సర్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్ మహిళా ఫ్యాన్స్ భుజాన్ని తాకింది. దీంతో ఆమె కాసేపు నొప్పితో బాధపడింది.
ఇక మ్యాచ్ ముగిసిన తరువాత ఆ అమ్మాయి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాడు పొలార్డ్. అంతేకాదండోయ్.. ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ఆమెను బహుమతి ఇచ్చాడు. ఆ అమ్మాయితో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పొలార్డ్‌ది మంచి మనసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Checking up on the fan who got hit by a 6️⃣ off his bat 🤯 – all grace and heart, Polly 💙#OneFamily #MINewYork #CognizantMajorLeagueCricket | @KieronPollard55 @MLCricket pic.twitter.com/GmKQRf3VMV
— MI New York (@MINYCricket) July 22, 2024