RangaRanga Vaibhavanga Trailer: రంగరంగ వైభవంగా ట్రైలర్.. వైష్ణవ్‌కు హిట్ గ్యారెంటీ అంటోన్న ఫ్యాన్స్!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

RangaRanga Vaibhavanga Trailer: మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

RangaRanga Vaibhavanga : రిషి, రాధల ప్రేమకథ ‘రంగరంగ వైభవంగా’ ఉంటుంది..

దర్శకుడు గిరీశాయ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను చాలా చక్కగా చూపించారు. ఇక వారిద్దరు ఒకరిపై ఒకరు గెలవాలనే పోటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది సినిమా కథలో చూపంచబోతున్నారు. వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు.

Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..

ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌కు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఈ ట్రైలర్ మంచి కంటెంట్‌తో నిండి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సెప్టెంబర్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు