Prem Kumar Review : PK కి పెళ్లి అయ్యిందా..? సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ సినిమా రివ్యూ..!

సంతోష్ శోభన్ ఈ శుక్రవారం 'ప్రేమ్ కుమార్' అనే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశాడు. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే..

Santosh Soban Prem Kumar Review tollywood

Prem Kumar Review : సంతోష్ శోభన్ (Santosh Soban) ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికే మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ‘ప్రేమ్ కుమార్’ అంటూ మరో చిత్రాన్ని తీసుకు వచ్చేశాడు. రాశి సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అభిషేక్ మ‌హ‌ర్షి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అనంత్ శ్రీకర్ సంగీతం అందించాడు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆగష్టు 18న థియేటర్స్ లోకి వచ్చింది.

Dulquer Salmaan : కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్.. తన పాత్రపై కామెంట్స్.. ప్రభాస్‌తో కాంబినేషన్ సీన్స్??

ఇక మూవీ కథ విషయానికి వస్తే.. ఒకప్పటి తెలుగు ఫ్యామిలీ సినిమా ఎండింగ్స్ మీకు గుర్తుకు ఉండే ఉంటాయి. వాటిలో హీరోయిన్ పెళ్లి పీటలు మీద ఉండగా హీరో వచ్చి నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ చెబుతాడు. దీంతో హీరోయిన్ ఫ్యామిలీ మారిపోయి హీరోకి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడితో శుభం కార్డు పడుతుంది. అయితే ప్రేమ్ కుమార్ అలియాస్ PK కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ పెళ్లికూతురు ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది. కానీ పీటలు మీద ఉన్న పెళ్ళికొడుకు సంగతి ఏంటి. ఆ పెళ్లి ఆగిపోవడం వల్ల అసలు ఆ పెళ్ళికొడుకు, అంటే ఈ సినిమాలో PK ఎటువంటి సమస్యలు ఎదురుకున్నాడో అనేదే సినిమా కథ.

Adah Sharma : క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న అదా శర్మ.. C.D ఫస్ట్ లుక్ రిలీజ్..

హీరోతో పెళ్లి కథని హీరోయిన్ తను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఆ పెళ్లి తరువాత హీరోకి వచ్చిన ప్రతి సంబంధం బ్రేక్ అవుతూ వస్తుంది. పెళ్లిళ్లు అన్ని ఇలా ఆగిపోవడం ఎక్స్‌పీరెన్స్ చేసిన PK.. లవ్ బ్రేకప్స్ చేయడం, ఇష్టం లేని పెళ్లిళ్లు ఆపడం వంటి జాబ్ ని తానే క్రియేట్ చేసి PK డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. అలా డిటెక్టివ్ అవతారం ఎత్తి మంచిగా సంపాదిస్తున్న సమయంలో మొదటిలో పెళ్లి పీటలు మీద నుంచి వెళ్లి పోయిన హీరోయిన్ మళ్ళీ హీరో లైఫ్ లోకి వస్తుంది. ఆ తరువాత హీరో లైఫ్ ఎటువంటి మలుపులు తిరిగింది అనేది థియేటర్స్ లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెళ్లి కాని ప్రేమ్ కుమార్ అలియాస్ PK గా సంతోష్ శోభన్ యాక్టింగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలు కూడా వారి పరిధిలో వారు ఎంటర్టైన్ చేశారు. అనంత్ శ్రీకర్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఓవర్ అల్ గా మూవీ విషయం గురించి చెప్పాలంటే.. పెళ్లి కోసం PK పడిన తిప్పలు నవ్వు తెప్పిస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు