Hi Nanna : మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తానంటున్న నాని..

హాయ్ నాన్న మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ గురించి నాని ట్వీట్.

Song update from Nani Mrunal Thakur Hi Nanna movie

Hi Nanna : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 30వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘హాయ్ నాన్న’ అనే ఫ్యామిలీ టైటిల్ ని పెట్టాడు ఈ మూవీకి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ (Shruti Haasan) ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

Pushpa 2 : పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు.. నెట్టింట చర్చ..

తాజాగా నాని ఈ మూవీ మ్యూజికల్ జర్నీని స్టార్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ ఎదురు చూస్తూ ఉండండి అంటూ నాని ఒక చిన్న వీడియోని కూడా షేర్ చేశాడు. అయితే ఆ వీడియోలో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ చూపించలేదు. మరి సాంగ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Nikhil-Naveen : ‘మామా.. నీ సినిమా చూడ‌లేక‌పోయా..’ నిఖిల్-నవీన్‌ పొలిశెట్టిల మ‌ధ్య సంభాష‌ణ వైర‌ల్‌..

కాగా నాని గతంలో జెర్సీ సినిమాలో తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో తండ్రి పాత్రని చేస్తుండడంతో ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు