Floods In Himachal : హిమాచల్ వరదల్లో 257కు చేరిన మృతుల సంఖ్య

రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది....

Floods In Himachal

Floods In Himachal : రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వ్లల 66 మంది మరణించగా రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల 191 మంది ప్రాణాలు కోల్పోయారు. (Rains, Floods In Himachal) ఈ వరదల్లో మరో 32 మంది గల్లంతు అయ్యారు. ఈ విపత్తు వల్ల 290 మంది గాయపడ్డారు.

Seema Haider : నోయిడా ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమాహైదర్…సినిమా ఆఫర్ తిరస్కరణ

భారీ వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1376 ఇళ్లు దెబ్బతిన్నాయి. (Floods In Himachal) మరో 7,935 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీవర్షాల వల్ల 270 దుకాణాలు, 2727 గోశాలలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 55 ఆకస్మిక వరదలు, 90 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 450 రోడ్లు మూసుకుపోయాయి. భారీవర్షాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.

Vande Bharat Express : ఒడిశా విద్యార్థులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉచిత ప్రయాణం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఆగస్టు 14న సెలవు ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 14న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని విద్యాశాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులతో సహా కొనసాగుతున్న అన్ని పరీక్షలను రద్దు చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. హిమ్‌ల్యాండ్ ప్రాంతంలో పెద్ద కొండచరియలు విరిగిపడటంతో సమీపంలోని ఇళ్లకు ముప్పు వాటిల్లింది.

ట్రెండింగ్ వార్తలు