Ramon Magsaysay award: రామన్ మెగెసెసే అవార్డు నిరాకరించిన సీపీఎం మహిళా నేత.. కారణమేంటంటే

ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసే’ అవార్డును నిరాకరించారు కేరళకు చెందిన సీపీఎం మహిళా నేత. తానో రాజకీయ నాయకురాలు కావడం వల్ల, పార్టీ హై కమాండ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Ramon Magsaysay award: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘రామన్ మెగసెసే’ అవార్డును సీపీఎం మహిళా నేత నిరాకరించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

కేరళకు చెందిన సీపీఎం నేత, మాజీ వైద్య శాఖా మంత్రి కేకే.శైలజను రామన్ మెగెసెసే అవార్డు కమిటీ సంప్రదించింది. రాష్ట్రంలో నిఫా వైరస్, కోవిడ్ సోకిన సందర్భంగా వాటిని అదుపు చేయడంలో ఆమె సమర్ధవంతంగా పనిచేశారు. కేకే.శైలజ చేసిన సేవలకుగాను, ఆమె పేరును తమ కమిటీ రామన్ మెగసెసే అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై ఆమె అనుమతి కావాలని కోరారు. వారు అనుమతిస్తేనే అవార్డు కోసం పరిశీలించి, ప్రకటిస్తారు. అయితే, తానొక రాజకీయ పార్టీకి చెందిన నేత కాబట్టి, ఈ విషయంపై పార్టీతో సంప్రదించి నిర్ణయం చెబుతానని అవార్డు కమిటీకి ఆమె వివరించారు. అనంతరం తను అవార్డును నిర్ణయిస్తున్నట్లు కమిటీకి తెలిపారు. దీనికి కారణం.. శైలజ ఈ అవార్డు తీసుకునేందుకు పార్టీ హై కమాండ్ అంగీకరించకపోవడమే.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

ఈ అంశంపై స్వయంగా కేకే శైలజ ఈ వివరాల్ని వెల్లడించారు. తనకు కమిటీ నుంచి సమాచారం అందిందని, అయితే పార్టీని సంప్రదించిన తర్వాత అవార్డు తీసుకోకూదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. ‘‘సాధారణంగా ఈ అవార్డుకు రాజకీయ నాయకులను పరిగణనలోకి తీసుకోరు. అయినా, నాకీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. అయితే, నేను సీపీఎంలో కేంద్ర సభ్యురాలిని. ఈ అవార్డు అందజేసే సంస్థ కమ్యూనిజాన్ని నమ్మదు. అందువల్ల ఆ సంస్థ అందజేసే అవార్డును తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా’’ అని కేకే శైలజ చెప్పారు. రామన్ మెగసెసే అవార్డు అంతర్జాతీయంగా చాలా ప్రతిష్టాత్మకమైనది. దీన్ని ‘ఆసియా నోబెల్’గా కూడా పిలుస్తారు.

 

ట్రెండింగ్ వార్తలు