Mobile Torches: కరెంటు లేక మొబైల్ టార్చ్‌తో రోగులకు చికిత్స.. వైరల్‌గా మారిన వీడియో

కరెంట్ సరఫరా లేకపోతే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు అత్యవసర ఏర్పాట్లు కూడా ఉండటం లేదు. దీనికి నిదర్శనం తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘటనే. ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో, మొబైల్ ఫోన్ల వెలుతురులోనే డాక్టర్లు చికిత్స అందించారు.

Mobile Torches: దేశంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితికి మరో నిదర్శనం ఈ ఘటన. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు చికిత్స చేయాల్సి వస్తోంది. ఉత్తర ప్రదేశ్‌, బల్లియా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలోనే గత శనివారం ఈ ఘటన జరిగింది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

శనివారం రాత్రి భారీ వర్షం వల్ల కరెంటు పోయింది. దీంతో ఆస్పత్రిలో పేషెంట్లకు డాక్టర్లు తమ మొబైల్ ఫోన్ వెలుతురులోనే చికిత్స అందించారు. దాదాపు గంట సేపటికిపైగా ఇదే పరిస్థితి ఉన్నట్లు అక్కడి రోగులు చెబుతున్నారు. వర్షం వల్ల కరెంటు కోతకు గురైతే, తక్షణ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదు. జనరేటర్, ఎమర్జెన్సీ లైట్లు లేకపోవడంతో మొబైల్ ఫోన్ల వెలుతురులోనే చికిత్స అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వారెవరో వీడియో తీయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ డా.రామ్ మాట్లాడారు.

Robot CEO: మొట్టమొదటి రోబో సీఈవోగా మిస్ టాంగ్ యూ.. నియమించిన చైనా కంపెనీ

అందరూ అనుకుంటున్నట్లు ఎక్కువ సేపు కరెంటు పోలేదని, 15-20 నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని, ఆలోపే జనరేటర్ బ్యాటరీల ద్వారా కరెంట్ సప్లై జరిగిందని ఆయన అన్నారు. బ్యాటరీలు వేరేగా ఉంచడం వల్లే, వాటిని అమర్చేందుకు టైమ్ పట్టిందని ఆయన చెప్పారు. ఈ ఘటన అక్కడి ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వసతులకు అద్దం పడుతోందని పలువురు అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు