DRDO: తక్కువ శ్రేణి రక్షణ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. వాయుతల ముప్పును ఎదుర్కొనే మిస్సైల్స్

దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.

DRDO: తక్కువ శ్రేణి కలిగిన గగనతల రక్షణ మిస్సైల్స్‌ను డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చండీపూర్ నుంచి మంగళవారం జరిపిన క్షిపణి పరీక్ష విజయవంతమైందని డీఆర్‌డీవో ప్రకటించింది.

Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి

ఇవి దేశీయంగా, పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మిస్సైల్స్. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో సెంటర్‌లో ఈ మిస్సైల్స్‌ను తయారు చేశారు. భూమిపై పోర్టబుల్ లాంఛర్ నుంచి రెండు వేర్వేరు పరీక్షల్లో ఈ మిస్సైల్స్ ప్రయోగించారు. ఇవి గగనతల రక్షణ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మిస్సైల్స్ వేర్వేరు టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియోనిక్స్ వంటి టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. ప్రధానంగా వాయు మార్గంలో వచ్చే ముప్పును తప్పించడానికి ఈ మిస్సైల్స్ ఉపయోగపడతాయి.

World No-3: అయ్యయ్యో అదానీ ర్యాంకు మళ్లీ పడిపోయింది.. రెండోసారి మూడో స్థానంలోకి ఆసియా కుబేరుడు

అంటే తక్కువ ఎత్తులో దూసుకొచ్చే ఇతర మిస్సైల్స్, విమానాలు, బాంబులు వంటివాటిని అడ్డుకుని ధ్వంసం చేస్తాయి. తాజాగా జరిపిన పరీక్షలో ఇవి విజయవంతంగా లక్ష్యాన్ని చేధించాయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్‌డీవో సిబ్బందిని, నిపుణులను అభినందించారు.

 

ట్రెండింగ్ వార్తలు