Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

పాకిస్తాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోయన ఒక మ్యాచ్ గురించి తలచుకున్నప్పడల్లా తనకు నిద్రపట్టదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించారు. పాక్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. అయితే, పాక్ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టి ఆ మ్యాచ్ గెలిపించుకున్నాడు.

Kapil Dev: 1986లో జరిగిన ఆస్ట్రాల్-ఆసియా కప్‌లో పాకిస్తాన్ చేతిలో భారత ఓటమి గురించి తలచుకున్నప్పుడల్లా తనకు నిద్ర పట్టదని వెల్లడించారు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ మ్యాచులో భారత్.. విజయపు అంచుదాకా వెళ్లి చివరి బంతిలో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ మ్యాచ్ తనకు నిద్రలేని రాత్రుల్ని ఇస్తుందని కపిల్ చెప్పారు.

Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం

తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. 1986లో భారత్-పాక్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. భారత్‌కే గెలిచే అవకాశాలు కనిపించాయి. రెండో ఇన్నింగ్స్‪లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. పాక్ గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి. అప్పట్లో ఈ పరుగులు సాధించడం అసాధ్యమని భారత జట్టు భావించింది. ముందుగా భారత జట్టు బాగానే బౌలింగ్ చేసింది. అయితే, పాక్ గెలిచేందుకు చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో జావెద్ మియందాద్ ఉన్నాడు. చేతన్ శర్మ బౌలింగ్. అయితే, చేతన్ శర్మ చివరి బంతి వేయగానే, మియందాద్ సిక్స్ బాదాడు. అంతే.. పాక్ అనూహ్య విజయం సాధించింది. దీంతో.. గెలుస్తుందనుకున్న మ్యాచ్ భారత్ ఓడిపోయింది.

AK 47s found: ఈడీ దాడుల్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం.. భారత జవాన్లకు చెందినవిగా గుర్తింపు

ఆ మ్యాచులో కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నారు. భారత్ ఓడిపోవడంతో ఆ ఓటమిని కపిల్ దేవ్‌తోపాటు, మన టీమ్ సభ్యులెవరూ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ మ్యాచ్ గురించి తలచుకున్నప్పుడల్లా తనకు నిద్ర పట్టదని గుర్తు చేసుకున్నారు కపిల్ దేవ్. అయితే, ఈ ఓటమి ప్రభావం భారత జట్టుపై దాదాపు నాలుగేళ్లు ఉందని కపిల్ తెలిపారు. ఆ మ్యాచులో భారత్ 245 పరుగులే చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు