Rajendra Pal Gautam: బాబాల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి

తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను దేవుళ్లుగా భావించనని.. పార్వతి, లక్ష్మీ, గణపతులకు పూజలు చేయనని, ఇలా హిందూ దేవుళ్లను నమ్మనని, వారి విశ్వాసాలను పాటించనని ప్రమాణం చేశారు. చాలా చోట్ల బౌద్ధాన్ని స్వీకరిస్తున్న క్రమంలో ఈ ప్రమాణాలు చేస్తున్నారు.

Rajendra Pal Gautam: ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‭కు హత్యా బెదిరింపులు వస్తున్నాయట. కొద్ది రోజుల క్రితం 22 బౌద్ధ ప్రమాణాలు చేసిన ఆయన.. హిందువుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఇక తరుచూ బౌద్ధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో తనకు బాబాల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అయోధ్యకు చెందిన ముగ్గురు హిందూ బాబాల నుంచి తనకు ఉత్తరాలు అందాయని, అందులో తనను చంపేస్తామంటూ బెదిరింపులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఒకరు తనను చంపిన వారికి 50 లక్షలు ఇస్తానని ప్రకటించారట.

సెప్టెంబర్ 6న ఢిల్లీలో నిర్వహించిన బౌద్ధ సమ్మేళనంలో అంబేద్కర్ ముని మనుమడు రాజరత్న అంబేద్కర్‭తో పాటు రాజేంద్ర పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1956లో ఇదే రోజున డాక్టర్ అంబేద్కర్.. హిందూ మతాన్ని వదిలేసి మౌద్ధాన్ని స్వీకరించారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అంబేద్కర్ చేసిన 22 బౌద్ధ ప్రమాణాలు పటిస్తుండగా గౌరవంగా నిల్చున్నారు. అంతే.. హిందుత్వాన్ని రాజేంద్ర పాల్ అవమానించారంటూ భారతీయ జనతా పార్టీ సహా ఇతర రైట్ వింగ్ గ్రూపులు ఒంటి కాలిపై లేస్తున్నాయి.

అంబేద్కర్ చేసిన ప్రమాణాల్లో ఏముంది?
తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను దేవుళ్లుగా భావించనని.. పార్వతి, లక్ష్మీ, గణపతులకు పూజలు చేయనని, ఇలా హిందూ దేవుళ్లను నమ్మనని, వారి విశ్వాసాలను పాటించనని ప్రమాణం చేశారు. చాలా చోట్ల బౌద్ధాన్ని స్వీకరిస్తున్న క్రమంలో ఈ ప్రమాణాలు చేస్తున్నారు.

Karnataka: జర్నలిస్టులకు స్వీటు బాక్సుల్లో నగదు బహుమతులు.. సీఎంపై కాంగ్రెస్ ఆరోపణలు

ట్రెండింగ్ వార్తలు