Free Laptops To Students : విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్ ఇస్తున్న భారత ప్రభుత్వం..! కేంద్రం క్లారిటీ

సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. 'భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది' అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్ ఫోన్లకు మేసేజ్ పంపుతున్నారు సైబర్ క్రిమినల్స్. ఇది వైరల్ కావడంతో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

Free Laptops To Students : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ లింక్స్ తో బ్యాంకు ఖాతాలు దోచేస్తున్నారు. నకిలీ ప్రకటనలతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా విద్యార్థులను టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్స్. స్టూడెంట్స్ అందరికీ భారత ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్స్ ఇస్తుందనే ప్రకటనతో ఫ్రాడ్ కు తెరలేపారు. ఇది వైరల్ గా మారింది. ఇది నిజం అని నమ్మి చాలామంది మోసపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి లింక్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Also Read..Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. ‘భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది’ అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్ ఫోన్లకు మేసేజ్ పంపుతున్నారు సైబర్ క్రిమినల్స్. ఇది వైరల్ కావడంతో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

Also Read..Mumbai Cheating : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లో రూ. 22,396 కొట్టేశారు.. అసలేం జరిగిందంటే?

ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. కేంద్రం ఇలాంటి పథకాన్ని నిర్వహించట్లేదని, ఇది ఫేక్ అని స్పష్టం చేసింది. సైబర్ క్రిమినల్స్ పంపే మేసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గుడ్డిగా లింకులను క్లిక్ చేయడం, వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయడం వంటివి అస్సలు చేయకూడదని చెప్పింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. వైరల్ గా మారిన ఆ మేసేజ్ సారాంశం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్స్ ఇస్తోంది. మీకూ ఉచిత ల్యాప్ టాప్ కావాలంటే మీ నెంబర్ ని Gov-Laptop యాప్ లో రిజిస్ట్రర్ చేసుకోండి అని అందులో ఉంటుంది. దాని కిందే లింక్ కూడా ఉంటుంది. పొరపాటున కానీ ఆ లింక్ ను క్లిక్ చేసి అందులో మన వ్యక్తిగత వివరాలు నమోదు చేశామంటే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రం హెచ్చరించింది.

టెక్నాలజీ ఎంత పెరిగిందో అంతే స్థాయిలో మోసాలు కూడా పెరిగాయి. మరీ ముఖ్యంగా సైబర్ నేరాలు బాగా ఎక్కువయ్యాయి. ఊరించే ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రోజూ ఫోన్లకు రకరకాల మేసేజ్ లు, లింక్స్ వస్తుంటాయి. ముందూ వెనకా ఆలోచన చేయకుండా కక్కుర్తి పడి గుడ్డిగా వాటిని క్లిక్ చేశామో ఇక అంతే.. బ్యాంకు ఖాతాలో దాచుకున్న డబ్బుంతా కోల్పోవాల్సిందే. అందుకే, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగుండాలని, ఫోన్ కు వచ్చే అడ్డమైన లింక్స్ ను క్లిక్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మన అప్రమత్తతే మనకు రక్ష అని చెబుతున్నారు.

స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా ల్యాప్ టాప్స్..! అసలు నిజం ఇదే..

ట్రెండింగ్ వార్తలు