Karnataka: మోదీ ర్యాలీకి వెళ్తే ₹500 ఇస్తామని చెప్పి ₹200 మాత్రమే ఇచ్చారు.. బీజేపీపై ఆరోపణలు

మేము రోజూ కూలీ పని చేసుకుని బతుకుతాం. ర్యాలీకి తీసుకెళ్లాలంటే మా రోజు కూలి ఇవ్వాలని చెప్పాము. దాని ప్రకారమే ముందుకు వాళ్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన అనంతరం ఒక వ్యక్తి మాకు 100 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించారు.

Karnataka: కర్ణాటకలోని దేవనహల్లిలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన ఆ ర్యాలీకి వచ్చే జనాలను బీజేపీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందని కొందరు అంటున్నారు. అయితే అది కూడా సక్రమంగా జరగలేదని, ముందు 500 రూపాయలు ఇస్తామని చెప్పి ర్యాలీకి వెళ్లిన అనంతరం 200 రూపాయలే ఇచ్చారని ర్యాలీకి వెళ్లిన కొంత మంది ఆరోపణలు గుప్పిస్తున్నారు.

చిక్కబల్లాపూర్‭లోని షిడ్లఘట్టకు చెందిన 40 మంది కూలీలు చేసిన ఆరోపణ ఇది. ఓ టీవీ చానల్ ముందే వాళ్లు ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రికార్డైన దాని ప్రకారం.. ‘‘మేము రోజూ కూలీ పని చేసుకుని బతుకుతాం. ర్యాలీకి తీసుకెళ్లాలంటే మా రోజు కూలి ఇవ్వాలని చెప్పాము. దాని ప్రకారమే ముందుకు వాళ్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన అనంతరం ఒక వ్యక్తి మాకు 100 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నించారు. మేము కాస్త గొడవ చేస్తే మమ్మల్ని బాగా అవమానించి ఇంకో 100 రూపాయలు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

తమకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారట ఆ కూలీలు. అయితే ఇలాంటి విషయమై ఎవరూ తమను సంప్రదించలేదని షిడ్లఘట్ట పోలీసులు తెలిపారు.

Salto de Castro: జస్ట్ ₹2 కోట్లు ఉంటే మొత్తం గ్రామాన్నే కొనేయొచ్చు.. ఎక్కడ, ఎలా అంటే?

ట్రెండింగ్ వార్తలు