Rohit Sharma: జాతీయ గీతం సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ.. నెటిజన్ల ప్రశంసలు

ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌కు ముందు స్టేడియంలో జాతీయ గీతాన్ని ప్లే చేయడం సంప్రదాయం.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

దీనిలో భాగంగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ముందుగా టాస్ వేశారు. అనంతరం ఇరు జట్ల సభ్యుల సమక్షంలో రెండు దేశాల జాతీయ గీతాలను ప్లే చేశారు. మొదట పాక్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అనంతరం ఇండియా జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్‌గా తొలి ఐసీసీ వరల్డ్ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ జాతీయ గీతం వింటూ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.

దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో గీతం వింటూ పరవశించిపోయాడు. ఆయన కళ్లు చెమర్చడం ఆ సమయంలో కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని భారత అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనంద పడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు