Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి

జనవరి 28వ తేదీన టీకా తీసుకున్న తర్వాత...మార్చి 01వ తేదీన చనిపోయిందని పిటిషన్ లో వెల్లడించారు. కోవిషీల్డ్ టీకా దుష్ర్పభావాల కారణంగా కుమార్తె మృతి చెందిందని, తనకు న్యాయం కావాలని...

Maharashtra Man Claims Daughter : కరోనా టీకాతో తన కూతురు చనిపోయింది.. ఇందుకు ప్రభుత్వం, సీరం సంస్థలు రూ. 1000 కోట్లు పరిహారం చెల్లించాలంటూ.. ఓ తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వైద్య విద్యార్థి అయిన తన కూతురు గత సంవత్సరం జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని… అయితే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రాణాలు పోయిందని వాపోయాడు. ఈ మేరకు ఆయన హైకోర్టు మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కానీ..హైకోర్టు విచారణకు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Read More : WhatsApp New Update : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. ఇకపై రెండు రోజులు పొడిగించే అవకాశం!

నాసిక్ లో తన కూతురు స్నేహాల్ వైద్య విద్యార్థిగా చదువుకొంటోందని, వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా…ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని తండ్రి లునావత్ తెలిపారు. టీకా సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పిందని తెలిపారు. దీంతో వైద్య కళాశాలలో తన కూతురు వ్యాక్సిన్ తీసుకుందన్నారు. తన కూతురితో పాటు ఎంతోమంది ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకున్నారని తెలిపారు. 2021, జనవరి 28వ తేదీన టీకా తీసుకున్న తర్వాత…మార్చి 01వ తేదీన చనిపోయిందని పిటిషన్ లో వెల్లడించారు. కోవిషీల్డ్ టీకా దుష్ర్పభావాల కారణంగా కుమార్తె మృతి చెందిందని, తనకు న్యాయం కావాలని కోరారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు తాను ఈ పిటిషన్ దాఖలు చేయడం జరుగుతోందన్నారు. మరి దీనిని హైకోర్టు విచారణకు అనుమతినిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు