Professor Saibaba Supreme Court : ప్రొ.జీఎన్.సాయిబాబా విడుదలపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ సాయిబాబ కేసు విచారణ జరుగనుంది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిన్న నిర్దోషిగా ప్రకటించడంపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Professor Saibaba Supreme Court : ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ సాయిబాబ కేసు విచారణ జరుగనుంది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిన్న నిర్దోషిగా ప్రకటించడంపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

నేడు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ప్రత్యేకంగా విచారణ జరపనుంది. ఉదయం 11గం.లకు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే నిలిపివేయాలని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఎన్‌ఐఎ కోరింది.

GN Saibaba Acquitted In Maoist Links Case : మావోయిస్టులతో లింక్‌ కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా నిర్దోషి.. జైలు నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశం

ప్రొఫెసర్ సాయిబాబా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. 2014 నుంచి జైలులో ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నారు. గడ్చిరోలి కోర్టు ఇచ్చిన జీవిత ఖైదును సాయిబాబా 2017లో హైకోర్టు లో సవాల్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబా సహా ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది.

ప్రస్తుతం సాయిబాబా నాగ్ పూర్ జైలులో ఉన్నారు. 90 శాతానికి పైగా అంగ వైకల్యంతో వీల్ చైర్ లోనే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయిబాబాను విడుదల చేయాలని హక్కుల నేతలు, సాయిబాబా కుటుంబ సభ్యులు అనేక సార్లు డిమాండ్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు