Rajastan: పైలట్ సీఎం అవ్వడం లేదా, పైలట్‭ను సీఎం కానివ్వడం లేదా? ఇంతకీ సీఎం గెహ్లాట్ ఏమంటున్నారు?

ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడిగా పైలట్ ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పైలట్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరిగింది

Rajastan: రాజస్తాన్‭లో కాంగ్రెస్, బీజేపీ అనే రెండు అధికార-విపక్ష పార్టీలు ఉన్నప్పటికినీ.. రాజకీయ యుద్ధం మాత్రం కాంగ్రెస్ లోపలే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం ముందు విపక్ష బీజేపీ ఆటలో అరటి పండులా కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. గెహ్లాట్ వర్సెస్ పైలట్. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి పీఠం కోసం సచిన్ పైలట్ కానరాని ప్రయత్నాలు చేస్తుంటే.. సీఎం కుర్చీ వరకు పైలట్‭ను రానివ్వకుండా గెహ్లాట్ తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సమయం దొరికితే చాలు ఈ ఇరువురు నేతల మధ్య మాటలు ఫిరంగుల్ని అందుకుంటాయి. ఎవరిని కదిలించినా అంతే. ఇక విమర్శలతో విరుచుకుపడతారు. తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్‭కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్‭పై మరోసారి విరుచుకుపడ్డారు గెహ్లాట్.

Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీకి కొత్త బాస్.. ఆసిం మునీర్‭ను నియమిస్తున్నట్లు ప్రధాని ప్రకటన

ఈ ఇంటర్వ్యూలో పైలట్‭ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుకుంటాననే పరోక్ష సంకేతాలు ఆయన చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కృతి ఉంటుంది. నేతల మధ్య ఎన్ని వైరాలు ఉన్నప్పటికీ, తమ శత్రువులు పదవులు అలంకరించినప్పటికీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. అంతే కానీ అధిష్టానాన్ని ఎదురించి తమ పంతం నెగ్గించుకోవాలని చూడరు. కానీ గెహ్లాట్ అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పైలట్‭ను అడ్డుకోవడానికి అవసరమైతే తన పదవిని సైతం ఒదులుకోవడానికి ఆయన వెనకాడరని, గాంధీ కుటుంబాన్ని సైతం లెక్క చేయరని మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో తేలిపోయింది.

కాగా, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, ఆయనను ఎవరూ ముఖ్యమంత్రి చేయలేరంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించడం గమనార్హం.

BMC Polls: ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ముంబైలో ఎన్నికల ప్రచారం చేయనున్న తేజశ్వీ యాదవ్

ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడిగా పైలట్ ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పైలట్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా సీనియర్ నేత, మాజీ సీఎం గెహ్లాట్‭నే ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.

పైలట్‭ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ ఎక్కువ కావడంతో గెహ్లాట్ ప్రభుత్వంపై పైలట్ తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తిరుగుబాటుకు దిగారు. వారి మద్దతు లేకుండా విశ్వాస పరీక్షలో గెహ్లాట్ నెగ్గారు. దీంతో పైలట్ తోక ముడవక తప్పలేదు. పైలట్ చేసిన పనికి అతడి పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టానం కట్ చేసింది.

Gujarat Polls: బీజేపీ-బీ టీం అంటూ విమర్శలు.. తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదన్న ఓవైసీ

ట్రెండింగ్ వార్తలు