Hanuman Jayanti 2023 : హనుమంతుడి దేహమంతా ‘సింధూరం పూత’ వెనుక సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం..

అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణాం లేదు. అటువంటి హనుమంతుడి శరీరమంతా సింధూరం ఎందుకు పూతగా ఉంటుందో తెలుసా? ఈ సింధూరం పూత వెనుక సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిన రహస్యం ఏమిటి? హనుమంతుడిని సింధూరంతో ఎందుకు పూజిస్తారు? అనే ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీకోసం..

Hanuman Jayanti 2023 : అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణాం లేదు. శ్రీరామ నాయం తప్ప మరో మాట పలనకని అనితరసాధ్య భక్తుడు హనుమంతుడు. నిస్వార్థ భక్తపరాయణుడు హనుమంతుడు.‘హనుమా’అంటూ శ్రీరాముడు పిలిచిన ఒక్క పలుకుతో ‘రామా’అంటూ ఇక రాముడి అడుగు జాడల్లో నడుస్తూ సీతమ్మ కోసం పరితపించిపోయే రాముడికి సీతమ్మ జాడ చెప్పిన అపర పరాక్రమవంతుడు హనుమంతుడు. శ్రీరాముడి సన్నిధి కంటే గొప్పది శ్రీరాముడి నామస్మరణ కంటే రుచి అయినది వేరేకొకటి లేదని సాటి చెప్పిన నిరుపమాన భక్తుడు హనుమంతుడు. సీతారాములు తిరిగి కలుసుకోవటానికి కీలక పాత్ర పోషించిన హనుమంతుడు రామయణంలో అత్యంత కీలక పాత్రధారుడు. హనుమంతుడు లేని రామాయణ లేదు. రాముడు ఉన్న స్థలమే పెన్నిథిగా భావించిన గొప్ప భక్తుడు.

తన మనసునే మందిరంగా..గుండెనే గుడి చేసి శ్రీరాముడిని ఆరాధించాడు. సేవించాడు. కొలిచాడు. హనుమంతుడు చిరంజీవి అని అంటారు. అంటే ఇప్పటికే హనుమంతుడు ఉన్నాడని హిందువల నమ్మకం. అటువంటి హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించిన అత్యంత గొప్ప భక్తుడు హనుమంతుడు అని చెప్పితీరాలి. అటువంటి హనుమంతుడు పేరు చెప్పగానే..గుర్తుకొచ్చేది..ఆయన విగ్రహం చూడగానే కనిపించేది ‘సింధూరం’..హనుమంతుడికి ‘సిందూరానికి’ సంబంధమేంటీ? హనుమంతుడు తన శరీరం నిండా సింధూరానికి పూసుకోవటం వెనుక సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం ఉందట..

హనుమంతుడు సీతాదేవిని ఎప్పుడూ ‘సీతమ్మ తల్లీ’అనే పిలిచేవాడట..సీతమ్మ అనే మాటలోనే అమ్మ ఉంది. కానీ హనుమంతుడికి సీతమ్మ అంటే సరిపోదు..సీతమ్మ తల్లీ అంటూ నిండుగా మనస్సు నిండా భక్తభావం పొంగిపొర్లుతుండా పిలిచే ఆ పిలుపుకు ఆ జగన్మాత సీతాదేవి కూడా ‘హనుమా’అంటూ ఆప్యాయంగా పిలిచేదట..అలా ఓరోజున సీతాదేవి నుదుటున సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవటం దూరం నుంచే చూసిన హనుమంతుడి అనుమానం వచ్చిందట..తల్లి ఎప్పుడూ ఆ సింధూరాన్ని నుదుటిన పెట్టుకుంటుంది ఎందుకు? ఏదో గొప్ప విశేషం ఉండే ఉంటుంది అదేదో తెలుసుకోవాలి అని అనుకుని..‘తల్లీ ఎందుకు సింధూరాన్ని పెట్టుకుంటున్నావు? అని అడిగాడటం భక్తిగా..దానికి సీతాదేవి ‘శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని’అంటూ చిరునవ్వుతో చెప్పిందట..అంతే సీతారాములకు గుండెల్లో గుడి కట్టిన హనుమంతుడు అప్పటినుంచి సీతారాములు క్షేమంగా ఉండాలని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకున్నాడట. హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తిని..ప్రేమను మాటల్లో చెప్పలేనిది. అదీ హనుమంతుడి శరీరం నిండా సింధూరం పూసుకోవటం వెనుక ఉన్న సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం..

ఎవరికైనా భయం కలిగితే అపర పరాక్రమ వంతుడు హనుమంతుడి సాలీసా చదువుకుంటారు. సంజీవని మొక్క తీసుకుని రమ్మంటే ఏకంగా సంజీవనీ మొక్కలుంటే సుమేరు పర్వతాన్నే ఎత్తుకొచ్చేసిన అత్యంత బలిశాలి హనుమంతుడు అత్యంత భయంకరమైన లంకిణినే ఒకే ఒక్క గుద్దుతో సంహరించిన హనుమంతుడు పేరు చెబితే భూతప్రేత పిశాచాలు సైతం భయపడి పారిపోతాయి..హనుమంతుడిని సింధూరంతోనే పూజిస్తారు.

అటువంటి హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హనుమంతుని గుడి ,విగ్రహం లేని ఊరు అరుదుగా ఉంటుందంటే హిందువులకు హనుమంతుడు అంటూ ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాముడే తన దేవుడని..రాముడిని చూడకుండా ఉండలేనని శ్రీరామ నామ స్మరణ చేయకుండా క్షణం కూడా ఉండలేని హనుమంతుడు తనను శరణువేడిన రాజు కోసం తన సరస్వంగా భావించిన శ్రీరాముడితోనే యుద్ధం చేసిన ధీరుడు. హనుమంతుడిపై శ్రీరాముడు రామబాణాన్ని సంధించగా రామభక్తి ముందు రామబాణం కూడా పనిచేయకుండా పోయింది. అంటే ఎదురులేని రామబాణం కంటే హనుమంతుడికి శ్రీరాముడి మీద ఉన్న భక్తే గొప్పదని చాటి చెప్పినవాడు అంజనీసుతుడు శ్రీ హనుమంతుడు..

 

ట్రెండింగ్ వార్తలు