Allu Aravind : టికెట్ రేట్ల‌ కంటే పెద్ద స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి.. డిప్యూటీ సీఎంతో మీటింగ్ త‌రువాత అల్లు అర‌వింద్ కామెంట్స్‌..

విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాత‌ల స‌మావేశం ముగిసింది.

విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాత‌ల స‌మావేశం ముగిసింది. ప‌వ‌న్‌తో స‌మావేశం అనంత‌రం నిర్మాత అల్లు అర‌వింద్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు అని చెప్పారు. మనస్ఫూర్తిగా అన్ని విషయాలు ప‌వ‌న్‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. టికెట్ల రేటు అనేది చాలా చిన్న విషయం అని అంతకంటే పెద్ద విషయాలు చాలానే ఉన్నాయ‌న్నారు. త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రెండేషన్ ఇస్తామ‌న్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన‌ట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్ లకు సన్మానం చెయ్యడానికి సమయం అడిగిన‌ట్లు వివ‌రించారు. పవ‌న్‌ను క‌లిసిన నిర్మాత‌ల్లో అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం.రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Theme Of Kalki : థీమ్ ఆఫ్ కల్కి ప్రోమో విడుదల.. మధుర యమునా నది ఒడ్డున నాట్యంతో శోభన..

ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు