Shubman Gill
Shubman Gill – Zimbabwe tour : టీ20 ప్రపంచకప్‌లో యువ స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు స్థానం దక్కలేదు. అయితే.. తాజాగా అతడికి బీసీసీఐ ఓ అద్భుత అవకాశాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పొట్టి ప్రపంచకప్ తరువాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో దుమ్ములేపిన యువ ఆటగాళ్లతో పాటు, పొట్టి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రాని యువప్లేయర్లతో కూడిన జట్టును జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
జింబాబ్వే పర్యటనలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమ్ఇండియా మ్యాచులు ఆడే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రింకూ సింగ్, అవేశ్‌ఖాన్‌లతో పాటు ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
జింబాబ్వే పర్యటనలో భారత్ 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
జింబాబ్వే పర్యటన షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జూలై 6న,
రెండవ టీ20 – జూలై 7న
మూడవ టీ20 – జూలై 10న
నాలుగో టీ20 – జూలై 13న,
ఐదో టీ20 – జూలై 14న.
Naveen ul Haq : ఆస్ట్రేలియా పై చారిత్రాత్మక విజయం.. విమర్శకులే లక్ష్యంగా నవీన్ ఉల్ హక్ పోస్ట్..