Asia Cup 2025 : ఆసియాకప్‌లో భారత్,పాక్ మ్యాచ్.. అంపైర్లు ఎవరో తెలుసా?
ఆసియాకప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Do you know who are the Umpires for IND vs PAK match in Asia Cup 2025
Asia Cup 2025 : మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ(Asia Cup 2025)కి యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఆసియాకప్ 2025ను పొట్టి ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ మెగాటోర్నీలో అంపైరింగ్ విధులు నిర్వర్తించే వారి వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఈ మెగాటోర్నీకి మ్యాచ్ రిఫరీలుగా అనుభవజ్జులైన రిచీ రిచర్డ్‌సన్, ఆండీ పైక్రాఫ్ట్ లు వ్యవహరించనున్నారు.
గ్రూపు దశకు సంబంధించి విధులు నిర్వర్తించే అంపైర్లు వీరే..
భారత్ నుంచి వీరేంద్ర శర్మ, రోహన్ పండిట్ శ్రీలంకకు చెందిన రవీంద్ర విమలసిరి, రుచిరా పల్లియాగురుగే, అఫ్గానిస్థాన్‌కు చెందిన అహ్మద్ పక్తీన్, ఇజతుల్లా సఫీ, పాకిస్థాన్‌కు చెందిన ఆసిఫ్ యాకూబ్, ఫైసల్ అఫ్రిది బంగ్లాదేశ్‌కు చెందిన గాజీ సోహెల్, మాస్‌లు గ్రూపు దశలోని మ్యాచ్‌లకు అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తారు.
భారత్ పాక్ మ్యాచ్ అంపైర్లు వీరే..
ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే మ్యాచ్‌ల్లో భారత్, పాక్ మ్యాచ్ ఒకటి. ఈ దాయాదుల పోరు సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా శ్రీలంకకు చెందిన రుచిర పల్లియగురుగె, బంగ్లాదేశ్‌కు చెందిన మసుదుర్ రెహ్మాన్ వ్యవహరించన్నారు. టీవీ అంపైర్‌గా అహ్మద్ పక్తీన్ (అఫ్గానిస్థాన్), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ (అఫ్ఘానిస్థాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు.
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు రుచిర, రెహ్మాన్‌లకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మంచి అనుభవమే ఉంది. రుచిర 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ బాధ్యతలు చేపట్టగా, రెహ్మాన్ 70కి పైగా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించాడు.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. అర్హత ఉన్నా గానీ చోటు దక్కకపోతే..
భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల్లో ఆన్‌ఫీల్డ్ అంపైర్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. వారు ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా తీవ్ర విమర్శలు తప్పవు అన్న సంగతి తెలిసిందే.