Chris Gayle : పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ పై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు.. అవమానించింది.. కుంబ్లే ముందు ఏడ్చాను.. కేఎల్ రాహుల్ ఫోన్ చేసి..
పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ పై క్రిస్ గేల్ (Chris Gayle) సంచలన ఆరోపణలు చేశాడు. తనను ఆ ఫ్రాంఛైజీ అవమానించిందన్నాడు.

Chris Gayle Accuses PBKS Of Disrespect Claims He Felt Depressed
Chris Gayle : వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ పంజాబ్ కింగ్స్ పై సంచలన ఆరోపణ చేశాడు. పంజాబ్ తనను దారుణంగా అవమానించిందని చెప్పాడు. ఓ సీనియర్ ఆటగాడు అయిన తనను ఓ చిన్నపిల్లాడిగా ట్రీట్ చేసిందన్నాడు. తనకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిందన్నాడు. ఆ బాధను తట్టుకోలేక తాను అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ముందు ఏడ్చానని తెలిపాడు. అప్పటి పంజాబ్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ తనకు ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా తాను సీజన్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నాడు.
క్రిస్‌గేల్ (Chris Gayle) 2009లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. 2021లో వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో గేల్ 142 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 39.7 సగటుతో 4965 పరుగులు సాధించాడు. ఇందులో 6 శతకాలు 31 అర్థశతకాలు ఉన్నాయి. ఇక అత్యధిక స్కోరు 175 నాటౌట్.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. అర్హత ఉన్నా గానీ చోటు దక్కకపోతే..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో గేల్ మాట్లాడాడు. తన ఐపీఎల్ కెరీర్ ముగింపు గురించి చెప్పుకొచ్చాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే పంజాబ్ తో నా ఐపీఎల్ ప్రయాణం ముందే ముగిసింది. అవును నేను చెప్పేది ఏమిటంటే పంజాబ్ కింగ్స్ XI ఫ్రాంచైజీలో నన్ను అగౌరవపరిచారు. లీగ్ కోసం, పంజాబ్ కోసం ఎంతో చేసిన ఓ సీనియర్ ఆటగాడినైనా నన్ను సరిగా చూసుకోలేదు అని నాకు అనిపించింది.’ అని గేల్ అన్నాడు.
కుంబ్లేకు ఫోన్ చేసి..
తనను ఓ చిన్న పిల్లలాడిలా ట్రీట్ చేశారన్నాడు. ఆసమయంలో భుజాలపై ఓ బరువును మోస్తున్నట్లుగా తనకు అనిపించిందన్నాడు. ఫ్రాంఛైజీ వైఖరి కారణంగా తాను మానసిక ఒత్తిడికి లోనైనట్లుగా చెప్పుకొచ్చాడు. తన జీవితంలో డిప్రెషన్ మోడ్‌లో ఉన్నట్లు అనిపించడం తనకు అదే తొలిసారి అని తెలిపాడు. అందువల్ల ఎవరైనా సరే డిప్రెషన్ గురించి మాట్లాడితే తనకు ఆబాధ ఎలా ఉంటుందో కొంచెం అర్థమవుతుందన్నాడు.
The Chase Teaser : యాక్షన్ హీరోగా మారిపోయిన కెప్టెన్ కూల్.. ఛేజ్ టీజర్ అదుర్స్..
ఆ సమయంలో పంజాబ్ వైఖరి నచ్చలేదు. వీలైనంత త్వరగా జట్టును వీడాలని అనుకున్నట్లు గేల్ తెలిపాడు. డబ్బు గురించి దిగులు లేదన్నాడు. డబ్బు కంటే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నాడు. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే కు ఫోన్ చేసి తన పరిస్థితి గురించి వివరించినట్లు చెప్పాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ 2021 కూడా ఉంది. కరోనా వల్ల బయో బబుల్‌లో ఉన్నాం. బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో మానసికి వేదనకు గురయ్యా. ఇది మరింత గందరగోళానికి దారి తీసిందన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో చివరి మ్యాచ్ ఆడిన తరువాత ఇక ఆడడం సరికాదని అనిపించినట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రశాంతత లేని చోట ఉండకూడదని భావించానని, వెంటనే అనిల్ కుంబ్లే కు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వెల్లడించాడు. కుంబ్లేతో మాట్లాడే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా చెప్పుకొచ్చాడు. వాస్తవం చెప్పాలంటే తాను ఏడ్చానని అన్నాడు.
ఆ సమయంలో ఫ్రాంఛైజీ వైఖరి, అనిల్ కుంబ్లే ప్రవర్తన పట్ల తాను నిరాశకు గురి అయినట్లుగా వెల్లడించాడు. ఆ తరువాత అప్పటి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తనకు ఫోన్ చేశాడని గేల్ చెప్పాడు. తనను జట్టులోనే కొనసాగమని, తదుపరి మ్యాచ్‌లో ఖచ్చితంగా ఆడతావని ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలిపాడు. అయితే తన మనసు అందుకు అంగీకరించలేదన్నాడు. అందరికి మంచి జరగాలని చెబుతూ.. బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్లిపోయాను అని గేల్ చెప్పాడు.
వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా రెండు దశల్లో జరిగింది. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈ సెకండ్ ఫేస్ మధ్యలోనే గేల్ పంజాబ్‌ను వీడి వెళ్లిపోయాడు. సెకండ్ ఆఫ్ లో గేల్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే ఆడాడు. ఆ సీజన్‌లో గేల్ మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడి 21.44 సగటుతో 193 పరుగులు మాత్రమే చేశాడు. 2018లో గేల్‌ను పంజాబ్ వేలంలో సొంతం చేసుకుంది. 2021లో అతడు వెళ్లిపోయాడు.