Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. అర్హత ఉన్నా గానీ చోటు దక్కకపోతే..
తుది జట్టులో ఉండడానికి అర్హత ఉండి, కనీసం జట్టులో కూడా ఎంపిక కాకపోతే ఏ ప్లేయర్ అయినా కూడా అసహనానికి గురి అవుతాడని శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) తెలిపాడు.

Shreyas Iyer calls Asia Cup snub frustrating in brutal deserve to be in the team
Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఆసియా కప్ 2025లో చోటు దక్కని సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అయ్యర్ (Shreyas Iyer) అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 48.60 సగటుతో 243 పరుగులు సాధించి ఆ టోర్నీలో అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ కోసం సెలక్టర్లు 15 మంది సభ్యులు గల బృందాన్ని ప్రకటించినప్పుడు అందులో శ్రేయస్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు బీసీసీఐ పై మండిపడ్డారు.
తనను ఎంపిక చేయకపోవడం పై ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ ఎక్కడా స్పందించలేదు. అయితే.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు మాట్లాడుతూ పరోక్షంగా దీనిపై స్పందించాడు. తుది జట్టులో ఉండడానికి అర్హత ఉండి, కనీసం జట్టులో కూడా ఎంపిక కాకపోతే ఏ ప్లేయర్ అయినా కూడా అసహనానికి గురవుతాడన్నారు.
The Chase Teaser : యాక్షన్ హీరోగా మారిపోయిన కెప్టెన్ కూల్.. ఛేజ్ టీజర్ అదుర్స్..
అయినప్పటికి కూడా.. అవకాశం లభించిన ప్రతి చోటా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండాలన్నాడు. నిలకడగా రాణిస్తూ ఉండాలన్నాడు. మనం ప్రాతినిధ్యం వహించిన జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేయాలన్నాడు. మన పనిని మనం చేస్తూ వెళ్లాలని అన్నాడు. ఎవరో చూస్తున్నారని పని చేయకూడదన్నాడు. మనల్ని ఎవరు చూసినా, చూడకున్నా కూడా మన పనిని మనం నిబద్ధతతో చేస్తుండడం ముఖ్యం అని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు.
వన్డేల్లో కీలక ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. ఏడాదికి పైగా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అతడు అంతర్జాతీయ టీ20 ఆడి రెండేళ్లు అవుతుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ నెల చివరిలో ఆస్ట్రేలియా ఏ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్ ఏ జట్టు భారత ఏ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక నాలుగు రోజుల టెస్టు సిరీస్‌తో పాటు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత్-ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు.
అయ్యర్ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 14 టెస్టులు, 70 వన్డేలు, 51 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 36.9 సగటుతో 811 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 48.2 సగటుతో 2845 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 22 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ10ల్లో 30.7 సగటుతో 1104 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్థశతకాలు ఉన్నాయి.