Asia Cup 2025 : పాక్ కానేకాదు.. ఆసియాకప్‌లో భారత్‌కు ఈ జట్టుతోనే అతి పెద్ద ముప్పు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓడించిందో తెలుసా?
ఆసియాకప్ (Asia Cup 2025) చరిత్రలో భారత జట్టును ఏ టీమ్ ఎక్కువ సార్లు ఓడించిందో తెలుసా? ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరుగగా..

This team is big threat for india in Asia cup history
Asia Cup 2025 : మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. యూఏఈ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ(Asia Cup 2025) లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతున్న భారత్‌కు ఈ మెగాటోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది.
మిగిలిన జట్ల నుంచి ఎలా ఉన్నా కూడా ఓ జట్టు నుంచి మాత్రం భారత్‌కు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ఆసియాకప్ 2025లోనూ ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టు మరేదో కాదు శ్రీలంక జట్టు.
Sanju Samson vs Shubman Gill : సంజూ శాంసన్ వర్సెస్ శుభ్‌మన్ గిల్.. ఇద్దరి టీ20ల గణాంకాలు ఇవే..
ఆసియాకప్ చరిత్రలో భారత్, శ్రీలంక జట్లు 23 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా లంక జట్టు 11 సార్లు గెలిచింది. అంటే దాదాపుగా చెరో మ్యాచ్‌లో గెలుచుకుంటూ వస్తున్నాయి అంటే ఇరు జట్ల మధ్య పోటీ ఎంత హోరాహోరీగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే శ్రీలంక పెద్ద ముప్పు.
ఆసియాకప్ చరిత్రలో భారత్‌కు మరే జట్టు నుంచి ఈ స్థాయిలో పోటీ ఎదురుకాలేదు. బంగ్లాదేశ్‌తో 15 మ్యాచ్‌లు ఆడితే 13 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ విషయానికి వస్తే.. పాక్‌తో 16 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది.
Asia Cup 2025 : ఆసియాకప్‌లో భారత్,పాక్ మ్యాచ్.. అంపైర్లు ఎవరో తెలుసా?
ఈ సారి ఆసియా కప్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ దేశాలు గ్రూపు-ఏలో ఉన్నాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంక, హాంగ్‌కాంగ్‌లు గ్రూప్ బిలో ఉన్నాయి.
కాగా.. భారత్, శ్రీలంక ఒకే గ్రూపులో లేకపోవడంతో లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడవు. సూపర్4 దశలోనే ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది.