Gautam Gambhir : రోహిత్, కోహ్లిల‌కు గంభీర్ చెక్‌..! బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వికాలం ముగియ‌నుంది.

Gautam Gambhir : రోహిత్, కోహ్లిల‌కు గంభీర్ చెక్‌..! బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!

Champions Trophy 2025 Last Chance For Rohit and Virat In ODIs Report

Updated On : June 24, 2024 / 3:03 PM IST

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వికాలం ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు కొత్త కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే ఆస‌క్తి అందరిలో నెల‌కొని ఉంది. ఇక కొత్త కోచ్‌గా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై బీసీసీఐ మ‌రికొన్ని రోజుల్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయొచ్చున‌ని అంటున్నారు. అయితే.. బీసీసీఐ ఎదుట గౌత‌మ్ గంభీర్ కొన్ని డిమాండ్లు ఉంచాడ‌ని, ఇందుకు బోర్డు సైతం ఓకే చెప్పిన‌ట్లుగా జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మొత్తం 5 కండిష‌న్ల‌ను గంభీర్ బీసీసీఐ ముందు ఉంచాడ‌ట‌.

– ఒక్క‌సారి తాను కోచ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత జ‌ట్టుకు సంబంధించిన విష‌యాల్లో బీసీసీఐ లేదా బ‌య‌ట నుంచి ఎవ‌రూ జోక్యం చేసుకోకూడ‌దు.

Naveen ul Haq : ఆస్ట్రేలియా పై చారిత్రాత్మక విజయం.. విమ‌ర్శ‌కులే ల‌క్ష్యంగా న‌వీన్ ఉల్ హ‌క్ పోస్ట్..

– బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్ కోచ్‌ల‌తో పాటు స‌హాయ సిబ్బందిని త‌న‌కు న‌చ్చిన వారిని ఎంపిక చేసుకునే సౌల‌భ్యం ఇవ్వాలి.

– మూడో డిమాండ్ చాలా కీల‌క‌మైంది. వ‌చ్చే ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ ష‌మీ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్లు గ‌నుక ఈ టోర్నీని గెలిపించ‌డంలో విఫ‌లం అయితే వారిని త‌ప్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌కూడ‌దు. వాళ్ల‌ను మూడు ఫార్మాట్ల నుంచి త‌ప్పిస్తారా..? లేదంటే వ‌న్డేల వ‌ర‌కేనా అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.

– ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ తో పాటు భ‌విష్య‌తును దృష్టిలో ఉంచుకుని భార‌త టెస్టు జ‌ట్టును సిద్ధం చేయాలి. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తూ క్ర‌మంగా యువ ఆట‌గాళ్ల‌ను జ‌ట్టులో భాగం చేయాలి.

WI vs SA : ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. ఇది డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ కాదు భ‌య్యా..

– వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ను సాధించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని బీసీసీఐతో గంభీర్ చెప్పాడు. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే త‌న ప్ర‌ణాళిక‌లు ఉంటాయ‌ని తెలిపాడు. అందుక‌నే జ‌ట్టు ఎంపిక‌లో పూర్తి స్వేచ్ఛ నివ్వాల‌ని కోరిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.