T20 Asia cup : కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకు.. ఆసియాకప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
టీ20 ఆసియాకప్ (T20 Asia cup) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?

From Virat kohli to Rohit sharma top five run scorers in T20 Asia cup
T20 Asia cup : యూఏఈ వేదికగా మంగళవారం నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఈ సారి ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. కాగా.. పొట్టి ఫార్మాట్‌లో ఆసియా కప్ (T20 Asia cup) జరగనుండడం ఇది మూడోసారి మాత్రమే. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్ జరిగింది.
టీ20 ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
విరాట్ కోహ్లీ..
టీ20 ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు 9 ఇన్నింగ్స్‌ల్లో 85.80 సగటుతో 429 పరుగులు సాధించాడు. 2022 ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్ పై అత్యధికస్కోరు 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఈసారి ఆసియా కప్‌లో విరాట్ ఆడడం లేదు.
మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2022 ఆసియాకప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 56.20 సగటుతో 281 పరుగులు సాధించాడు. అయితే.. ఫామ్ లేమీతో ఇబ్బంది పడుతున్న అతడు ఈ సారి ఆసియాకప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.
రోహిత్ శర్మ..
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2016, 2022 ఎడిషన్లలో రోహిత్ ఆడాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 30.11 సగటుతో 271 పరుగులు సాధించాడు. టీ20కి హిట్‌మ్యాన్ వీడ్కోలు పలకడంతో ఈ సారి అతడు ఆసియాకప్‌లో ఆడడం లేదు.
ఇబ్రహీం జద్రాన్..
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2022 ఆసియాకప్‌లో పరుగుల వరద పారించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65.33 సగటుతో 196 పరుగులు సాధించాడు.
Sanju Samson vs Shubman Gill : సంజూ శాంసన్ వర్సెస్ శుభ్‌మన్ గిల్.. ఇద్దరి టీ20ల గణాంకాలు ఇవే..
భానుక రాజపక్స..
2022లో శ్రీలంక జట్టు ఆసియాకప్ గెలవడంలో భానుక రాజపక్స కీలక పాత్ర పోషించాడు. అతడు 6 ఇన్నింగ్స్‌ల్లో 47.75 సగటుతో 191 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఫైనల్‌లో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.