World Cup 2023: ఆల్ రౌండర్లతో నిండిపోయిన ఆసీస్.. ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..

15మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే, ఇది తాత్కాలిక జట్టు అని ట్వీట్‌లో పేర్కొంది. పాట్ కమిన్స్ నాయకత్వంలో ...

World Cup 2023 Australia Squad

World Cup 2023 Australia Squad: ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్ వేదికగా ప్రారంభమయ్యే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకోసం అన్ని దేశాల క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. బీసీసీఐ టీంను ప్రకటించిన కొద్ది గంటల్లోనే క్రికెట్ ఆస్ట్రేలియా తమ టీంను ప్రకటించింది. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ -2023 కోసం స్టార్ పేసర్ ప్యాట్రిక్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ఉదయం ప్రకటించింది. జట్టులో ఎక్కువగా ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే ఆల్ రౌండర్లతో కంగారూల జట్టు బలంగా కనిపిస్తోంది.

ODI World Cup 2023 : ఆరంభ వేడుక‌లు..! అప్ప‌ట్లో రిక్షాల‌పై ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్లు.. ఇప్పుడెలా వ‌స్తారో..?

ఐదు సార్లు వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా ఈ సంవత్సరం ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023కోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేసింది. అయితే, సెప్టెంబర్ 28 నాటికి మైదానంలోకిదిగే 11 మంది పేర్లను ప్రకటించనుంది. ఈ జట్టులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ, ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్‌, భారత సంతతికి చెందిన యువ స్పిన్నర్ తన్వీర్ సంఘాలకు చోటు దక్కలేదు. కొద్దికాలంలోనే స్టార్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మార్నస్ లాబుస్‌చాగ్నేకు కూడా అవకాశం దక్కలేదు.

Team India: వన్డే ప్రపంచకప్ కు భారత్ జట్టు ప్రకటన.. ఎవరెవరు ఉన్నారంటే?

15మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే, ఇది తాత్కాలిక జట్టు అని ట్వీట్‌లో పేర్కొంది. పాట్ కమిన్స్ నాయకత్వంలో అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. బ్యాకప్ పేసర్ గా జట్టులో చివరి స్థానంకోసం సీన్ అబాట్ కు ప్రాధాన్యత దక్కింది. ఆష్టన్ అగర్, అడమ్ జంపా జట్టులో స్పిన్ విభాగంలో బౌలింగ్ చేస్తారు. అయితే, జంపాకు భారత్‍‌లో ఆడిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులో జంపాకు క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం లభించింది. బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్‌లు ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్‍లో అక్టోబర్ 8న చెన్నై వేదికగా భారత్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతుంది.

World Cup 2023 Tickets : టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులు.. సైట్ క్రాష్‌.. మున్ముందు క‌ష్టాలేనా..!

ఆస్ట్రేలియా జట్టు ఇదే ..
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

ట్రెండింగ్ వార్తలు