Suryakumar Yadav : డ‌గౌట్‌లో తిన్నందుకు ట్రోలింగ్‌.. సూర్యకుమార్ యాద‌వ్ రిప్లై అదుర్స్‌.. ‘నాకు ఆర్డ‌ర్ ఇవ్వ‌కు..’

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ దూసుకుపోతుంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

Suryakumar Yadav Eating In Dugout

Suryakumar Yadav Eating In Dugout : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ దూసుకుపోతుంది. ఆడిన మూడు మ్యాచుల్లో విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, జ‌స్ ప్రీత్ బుమ్రాలు సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. కుల్దీప్ యాద‌వ్ సైతం అంచ‌నాల‌ను మించి రాణిస్తున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచుల్లో సైతం టీమ్ఇండియా ఇదే జోష్‌ను కంటిన్యూ చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆట‌గాళ్లు అద్భుతంగా రాణిస్తుండ‌డంతో భార‌త తుది జ‌ట్లులో పెద్ద‌గా మార్పులు చేయ‌డం లేదు. దీంతో కొంత మంది టాప్ ప్లేయ‌ర్లు బెంచీకే ప‌రిమితం అయ్యారు. వారిలో సూర్య‌కుమార్ యాద‌వ్ ఒక‌డు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రెండు అర్థ‌శ‌త‌కాలు బాది మంచి ఊపులో ఉన్నాడు. అయితే టీమ్ కాంబినేష‌న్ కార‌ణంగా అత‌డికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం లేదు.

2028 LA Olympics : లాంఛ‌నం పూర్తి.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. 128 ఏళ్ల త‌రువాత‌

వ‌న్డే ప్రపంచ‌క‌ప్ తుది జ‌ట్టు జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మొద‌టి మ్యాచ్ స‌మ‌యంలో డ‌గౌట్‌లో కూర్చున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఏదో తింటుండ‌గా కెమెరా మెన్ అత‌డి పై ఫోక‌స్ చేశాడు. దీన్ని గ‌మ‌నించిన సూర్య‌కుమార్ తిన‌డం ఆపేసి క‌ద‌ల‌కుండా అలాగే ఉండిపోయాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూర్య ఇచ్చిన రియాక్ష‌న్ల‌కు నెటీజ‌న్లు ఫిదా అయ్యారు.

 

అయితే.. కొంద‌రు సూర్య‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘సార్.. మీరు డగౌట్‌లో కూర్చుని ఏమి తింటూ ఉంటారు. వెళ్లండి గ్రౌండ్‌లోకి వెళ్లి రెండు ఫోర్లు లేదా సిక్స్‌లు కొట్టండి.’ అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేశాడు. దీనిపై సూర్య‌కుమార్ యాద‌వ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘సోద‌రా నాకు ఆర్డ‌ర్ ఇవ్వ‌కు.. స్విగ్గీలో ఆర్డ‌ర్ చేయి.’ అంటూ స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చాట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

AUS vs SL : అరె ఏంట్రా ఇది.. బంగారం లాంటి అవ‌కాశం వ‌దిలేశావ్‌..! క్రీడా స్పూర్తి..!

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా నాలుగో విజయం పై క‌న్నేసింది. గురువారం భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు