Asia Cup 2023: రెండు జట్ల స్కోర్ సమం.. శ్రీలంక విజేతగా ఎలా అయింది? అసలు ఈ లెక్కేంటి!

రెండోసారి వర్షం రాకముందు పాకిస్థాన్ నవాజ్ వికెట్ ను కోల్పోకపోతే అప్పుడు శ్రీలంక టార్గెట్ 252 కు బదులుగా 255 ఉండేది.

Asia Cup 2023

India vs Pakistan Match: ఆసియా కప్ 2023 టోర్నీ చివరి దశకు చేరింది. ఇప్పటికే భారత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. భారత్ జట్టుతో ఫైనల్ పోరులో తలపడేందుకు పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక జట్లు గురువారం తలపడ్డాయి. అయితే, పాకిస్థాన్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి డక్ వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంక జట్టును విజయం వరించింది. అయితే, ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మెదళ్లను ఓ ప్రశ్న తొలుస్తోంది. శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ లో శ్రీలంక స్కోర్ 252, పాకిస్థాన్ స్కోర్ 252 మరి శ్రీలంకను విజేతగా ఎలా ప్రకటించారన్న విషయం అభిమానులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తోంది.

Asia Cup 2023: ఆసియాకప్ ఫైనల్‌లో భారత్‌, శ్రీలంక జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఎవరిది పైచేయి అంటే..

శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం కారణంగా తొలుత 45 ఓవర్లకు ఆ తరువాత 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్లు నష్టపోయి నిర్ణీత ఓవర్లలో 252 పరుగులు చేసింది. లంక లక్ష్యం 253 ఉండాల్సింది.. కానీ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 252కు తగ్గించారు. అలా ఎందుకంటే.. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 27.4 ఓవర్ల వద్ద వర్షం పడింది. ఆ సమయంలో పాకిస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. రెండోసారి వర్షం రావడం వల్ల మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. రెండోసారి వర్షం రావడానికి ముందే పాకిస్థాన్ ఐదు వికెట్లు కోల్పొయింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. టార్గెట్‌లో ఒక్క పరుగు డిడెక్ట్ చేశారు. అప్పుడు పాకిస్థాన్ 251 పరుగులు మాత్రమే చేసినట్లు అవుతుంది. దీంతో లంక టార్గెట్ 252 అవుతుంది.

Asia Cup 2023 : పాకిస్తాన్‌పై శ్రీలంక సంచలన విజయం.. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ, ఫైనల్లో భారత్‌తో ఢీ

రెండోసారి వర్షం రాకముందు పాకిస్థాన్ నవాజ్ వికెట్ ను కోల్పోకపోతే అప్పుడు శ్రీలంక టార్గెట్ 252 కు బదులుగా 255 ఉండేది. డక్ వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం వికెట్లే కీలకం. దీంతో వికెట్లను కోల్పోకుండా ఉంటే ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ ఇస్తారు.అయితే, శ్రీలంక, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి రెండు బంతుల్లో శ్రీలంక ఆరు పరుగులు చేయాల్సి ఉంది. చివర్లో శ్రీలంక ఆల్ రౌండర్ చరిత్ అసలంక తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈనెల 17న కొలంబోలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు భారత్ జట్టుతో తలపడనుంది.

ట్రెండింగ్ వార్తలు