Airtel 5G Services : 5G ఫోన్ ఉన్నా ఎయిర్‌టెల్ యూజర్లందరికి 5G సేవలు కష్టమే.. ఎందుకో తెలుసా?

Airtel 5G Services : భారత మార్కెట్లోకి అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు దేశంలో 5G సర్వీసులను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి. అయితే రాబోయే ఈ 5G సేవలు అందరి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయా? అంటే కాదనే చెప్పాలి.

Airtel 5G Services : భారత మార్కెట్లోకి అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు దేశంలో 5G సర్వీసులను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి. అయితే రాబోయే ఈ 5G సేవలు అందరి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే 5G సర్వీసు ప్రారంభంలో అందరికి అందుబాటులోకి తీసుకురావడ కష్టమైన పనే. అందుకే పరిమితంగా 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికం కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.

అందులో భారతీ ఎయిర్ టెల్ (Airtel 5G Network) ముందుగా 5G సర్వీసులను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి నెట్ వర్క్ యూజర్ 5G సర్వీసులను వినియోగించుకోవచ్చా లేదంటే చెప్పడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే 5G సర్వీసులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఎయిర్ టెల్ అందించే 5G ప్లాన్‌లపై ప్రీమియం వసూలు చేయకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ 5G సర్వీసులు అందుబాటులో ఉండదని ఎయిర్‌టెల్ తెలిపింది.

భారతి ఎంటర్‌ప్రైజెస్ వైస్-ఛైర్మన్ అఖిల్ గుప్తా మాట్లాడుతూ.. ప్రారంభ దశలో అధిక ధరతో టారిఫ్ ప్లాన్‌లకు మాత్రమే టెల్కో 5G సేవలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో సూపర్‌ఫాస్ట్ నెట్‌వర్క్ వేగంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. 5G ప్రారంభమైన తర్వాత వేగవంతమైన ఇంటర్నెట్ యూజర్లు ఆటోమాటిక్‌గా పొందవచ్చునని తెలిపారు. హై లెవల్ 5G ప్లాన్‌లకు మారేందుకు యూజర్లను ప్రేరేపించగలదని ఎయిర్‌టెల్ భావిస్తోంది. 5G హ్యాండ్‌సెట్ ఉన్న ఎవరైనా 5G సర్వీసులను పొందవచ్చు.

Airtel’s 5G services may only be limited to more expensive plans

ఆటోమేటిక్‌గా హైటారిఫ్‌కి మారిపోతారు. తద్వారా టెల్కోలకు అధిక రాబడి వస్తుందని అంచనా. మరింత సరసమైన లేదా తక్కువ-స్థాయి 5G ప్లాన్‌లు అందుబాటులోకి రావచ్చని కంపెనీ సూచించింది. అయితే అది డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. 5G వినియోగం పెరిగే కొద్ది దాని డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని, వినియోగం పెరగడం ఖాయమని గుప్తా తెలిపారు. వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందినట్లయితే.. మీరు ఎక్కువ డేటాను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఎయిర్‌టెల్ ప్రారంభ సంవత్సరాల్లో అభివృద్ధి చెందేందుకు చైనీస్ టెక్ సహాయం చేసింది. ఈ నెలలో భారత మార్కెట్లో 5Gని లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించిన వారాల తర్వాత ఎయిర్ టెల్ ఈ ప్రకటన చేసింది. ఆగస్ట్ నెలాఖరులో 5G సర్వీసులు అందుబాటులో వస్తాయని భావిస్తోంది. ప్రారంభంలో టెల్కో కనీసం ఒకటి లేదా రెండు ప్రధాన సర్కిల్‌లలో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మార్చిలో ఎయిర్‌టెల్ CTO రణదీప్ సెఖోన్ మాట్లాడుతూ.. దేశంలో 5G ప్లాన్‌లకు ప్రస్తుత 4G ప్లాన్‌ల కంటే ఎక్కువ ఖర్చు ఉండదని చెప్పారు. ఇటీవల ముగిసిన 5G వేలంలో ఎయిర్‌టెల్ రెండవ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. రూ.43,084 కోట్లకు 19,800MHz స్పెక్ట్రమ్‌ను ఎయిర్ టెల్ కొనుగోలు చేసింది.

Read Also : 5G Services in India : భారత్‌లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి? ఎంతమంది 5Gకి మారడానికి రెడీగా ఉన్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు