Elon Musk: ట్విటర్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్ సదుపాయం..

త్వరలో ట్విటర్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఐఓఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్, పీసీలలో ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే పనిచేస్తుందని మస్క్ తెలిపారు.

Elon Musk

Elon Musk Twitter: ట్విటర్ (ఎక్స్) నుంచి మీరు ఎవరికైనా కాల్ చేయాలని అనుకుంటున్నారా? లేదా వీడియో కాల్ చేయాలనుకుంటున్నారా? త్వరలో మీకు ఆ సదుపాయాన్ని కల్పించేందుకు ట్విటర్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ట్విటర్ (ఎక్స్) అధిపతి ఎలామన్ మస్క్ చెప్పారు. ఈ మేరకు గురువారం మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్ ప్రకారం. మీరు ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్ చేసుకొనే అవకాశం లభిస్తుందట.

Elon Musk : లిటిల్ ఎక్స్.. అంటూ ముద్దులొలుకుతున్న తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్

త్వరలో ట్విటర్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఐఓఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్, పీసీలలో ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే పనిచేస్తుందని మస్క్ తెలిపారు. అయితే, ఈ ఫీచర్ ట్విటర్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులో వస్తుందనే విషయంపై మస్క్ స్పష్టత ఇవ్వలేదు. కేవలం.. త్వరలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మాత్రమే చెప్పారు. ఇదిలాఉంటే.. త్వరలో ట్విటర్ లో అందుబాటులోకి వచ్చే ఆడియో, వీడియో కాల్ సదుపాయం బ్లూ టిక్ కలిగియున్న వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందా? అందరికీ అందుబాటులో ఉంటుందా అనే విషయంపై మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Biden, Elon Musk : ఆశ్చర్యంగా అనిపించలేదన్న బైడెన్, కాస్త లేట్ అయ్యిందన్న మస్క్.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై కామెంట్లు

ఇదిలాఉంటే ట్విటర్‌లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం గురించి వినడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ డిజైనర్ ఆండ్రూ కాన్వే జూలైలో ఫీచర్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ లను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆడియో, వీడియో కాల్ సదుపాయం వాట్సాప్ లో అందుబాటులో ఉంది. అదికూడా ఫోన్ నెంబర్ సహాయంతో కాల్స్ చేసుకోవచ్చు. కానీ, మస్క్ ట్విటర్ లో అందుబాటులోకి తీసుకొచ్చే ఫీచర్ లో ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకొవచ్చని వెల్లడించారు. దీంతో మాస్క్ తాజా ప్రకటన ట్విటర్ యూజర్స్‌లో ఆసక్తిని రేపుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు